Invitation For Indian Cricket Teams: భారత్ దౌత్యపరమైన వివాదాలతో మాల్దీవులు తీవ్రంగా నష్టపోయింది. ఇక్కడ నుంచి వెళ్ళే పర్యాటకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో మాల్దీవులకు చాలా ముఖ్య ఆదాయ వనరు అయిన పర్యాటకం రంగం కుదేలయిపోయింది. అంతకు ముందు విపరీతంగా మాల్దీవులకు వెళ్ళే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దాంతో ఇప్పుడు ఆ దేశ పర్యాటక సంస్థలు దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. ఈ క్రమంలో తాజాగా టీ20 ప్రపంచకప్ సాధించిన భారత క్రికెట్ జట్టును తమ దేశంలో పర్యటించాల్సిందిగా విజ్ఞప్తి చేశాయి. ప్రపంచకప్ విజయోత్సవ సంబరాలను మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకోవాలని పిలుస్తున్నాయి. గెలుపు ప్రత్యే క్షణాలను సొంతం చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానం పలికాయి.
మాల్దీవులు అసోసియేషన్ ఆఫ్ టూరిజం ఇండస్ట్రీ (ఎంఏటీఐ), మాల్దీవులు మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ (ఎంఎంపీఆర్‌సీ)లు సంయుక్తంగా భారత క్రికెటర్లకు ఆహ్వానాు పలికాయి. భారత క్రికెట్ జట్టును స్వాగతించడం, వారి విజయోత్సవంలో పాలుపంచుకోవడం మాల్దీవులకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. వారికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం అంటూ ప్రకటన చేశాయి. ఇరుదేశాల మధ్య బలమైన, దీర్ఘకాలిక.. సాంస్కృతిక, క్రీడా సంబంధాలు ఎప్పటినుంచో ఉన్నాయని, వాఇని మరింత బలోపేతం చేసుకోవాలని ఎంఎంపీఆర్‌సీ సీఈవో, ఎండీ ఇబ్రహీం షియురీ, ఎంఏటీఐ సెక్రటరీ జనరల్ అహ్మద్ నజీర్ తెలిపారు.