Crime News: 18 మందిని చంపిన ఆ హంతకుడు మృతి.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు

అమెరికాలోని లెవిస్‌టన్‌ పట్టణంలో ఇటీవల కాల్పులు జరిపిన నిందితుడు రాబర్ట్ కార్డ్ మృతి చెందాడు. ఓ రీసైక్లింగ్ సెంటర్ దగ్గర్లోని చెట్ల పొదల్లో ఒకరి మృత దేహాన్ని స్థానికులు గుర్తించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని రాబర్డ్ కార్డ్‌గా గుర్తించారు. బుల్లెట్ గాయంతో అతడు మృతి చెందాడని తెలిపారు. అయితే రాబర్ట్ కార్డ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా కాల్చి చంపారా? అన్న విషయాన్ని పోలీసులు ఇంకా తేల్చలేదు.

Crime News: 18 మందిని చంపిన ఆ హంతకుడు మృతి.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు
New Update

ఇటీవల అమెరికాలోని మైన్ రాష్ట్రంలో లెవిస్‌టన్‌లో భీకర కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కాల్పులు చేసిన నిందితుడు రెండు రోజుల తర్వాత శవమై కనిపించాడు. శుక్రవారం రాత్రి అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చివరికి నిందితుడి మృతితో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత బుధవారం రాత్రి లెవిస్‌టన్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 13 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని 40 ఏళ్ల రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. అతడి వద్ద ఆయుధాలు ఉండటం వల్ల.. మళ్లీ నిందితుడు కాల్పులకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Also Read: అమ్మో.. నాకు విషం పెట్టి చంపేసేలా ఉన్నారు: ఇమ్రాన్ ఖాన్

లెవిస్‌టన్‌లో ఉంటున్న ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడని హెచ్చరించారు. దీంతో అక్కడి ప్రజలు రెండు రోజుల పాటు భయంతో నిద్రలేని రాత్రులు గడిపారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి లెవిస్‌టన్‌లోనే ఓ రీసైక్లింగ్ సెంటర్ దగ్గర్లోని చెట్ల పొదల్లో ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని రాబర్ట్ కార్డ్‌గా గుర్తించారు. బుల్లెట్ గాయంతో నిందితుడు మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. అయితే రాబర్డ్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా కాల్చేశారా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మరో విషయం ఏంటంటే రాబర్డ్ కార్డ్ గతంలో ఆర్మీ రిజర్వులో ఒక శిక్షణ కేంద్రంలో ఆయుధ వినియోగ శిక్షకుడిగా పని చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అలాగే అతడు ఇంతకుముందు గృహ హింస కేసులో అరెస్టయి విడుదలయ్యాడని.. ఆ తర్వాత మానసిక సమస్యలతో రెండు వారాల పాటు చికిత్స పొందినట్లు వెల్లడించారు.

#police #telugunews #usa-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe