Rajasthan Budget: యువతకు 10 లక్షల ఉద్యోగాలు.. రాజస్థాన్‌ బడ్జెట్‌ హైలెట్స్‌

రాజస్థాన్‌లో బడ్జెట్ సమావేశాల్లో ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి దియా కుమారి గురువారం 2024-2025 ఆర్థిక ఏడాదికి సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.4.90 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌కు ముందే రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

New Update
Rajasthan Budget: యువతకు 10 లక్షల ఉద్యోగాలు.. రాజస్థాన్‌ బడ్జెట్‌ హైలెట్స్‌

రాజస్థాన్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి దియా కుమారి గురువారం 2024-2025 ఆర్థిక ఏడాదికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.4.90 లక్షల కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్‌కు ముందే రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. రైతులు, మహిళలు, యువత, విద్యార్థలు, వ్యాపారులతో సహా ప్రతి రంగాల్లో ఉన్నవారిని ప్రోత్సహించే దిశగా దీన్ని రూపొందించారు. ఇందులో యూవతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 10 లక్షల ఉద్యోగాలు అందించడం, అలాగే 2,570 కిలోమీటర్లకు పైగా తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించడ వంటి అనేక ప్రతిపాదనలు తీసుకొచ్చారు.

Also read: ఫేక్‌ సర్టిఫికేట్లతో ఏకంగా IAS ఉద్యోగం.. ఎలా దొంగ అధికారి ఎలా దొరికారంటే?

బడ్జెట్ కీ పాయింట్స్

1. రూ.15 వేల కోట్లతో 25 లక్షల ఇళ్లకు నీటిని అందించడం. ప్రతి జిల్లాలో రెండు ఆదర్శ సోలార్‌ గ్రామాలను నిర్మించడం.
2. రోడ్ల నిర్మాణ కోసం రూ.9 వేల కోట్ల కేటాయింపు. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల స్మార్ట్‌ ఎలక్ట్రిసిటీ మీటర్లు ఏర్పాటు చేయడం.
3. 2750 కిలోమీటర్లకు పైగా తొమ్మిది గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించడం. ఇందుకోసం రూ.30 కోట్లతో డీపీఆర్‌ను సిద్ధం చేయడం.
4. జిల్లాల అభివృద్ధి కోసం రూ.500 కోట్లతో డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యోజన పథకం. పట్టణ ప్రాంతాల్లో మహిళల కోసం బయో పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేయడం.
5. వోకల్ ఫర్ లోకల్, వన్ డిస్ట్రిక్ట్‌ వన్‌ ప్రొడక్ట్‌ కోసం రూ.100 కోట్లు కేటాయింపు
6. టూరిజం అభివృద్ధి కోసం రూ.200 కోట్లు కేటాయింపు
7. కాలుష్యాన్ని నివారించేందుకు రూ.10 కోట్లతో 10 వేల సోలార్ కుకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం
8. యువత కోసం 70 వేల ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఐదేళ్లలో 4 లక్షల ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ ఉంటుంది. ఈ ఏడాది లక్ష ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ జరుగుతుంది. యూత్ పాలసీ 2024 కింద.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు 10 లక్షల ఉద్యోగాలు అందించడం.

Also Read: పతంజలి నుంచి 14 రకాల వస్తువులు బ్యాన్.. రాందేవ్ బాబా నిర్ణయం

Advertisment
తాజా కథనాలు