Movies : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.99కే మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మూవీ చూసే ఛాన్స్!

సినీ ప్రియులకు MAI గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా లవర్స్ డే సందర్భంగా మే 31న దేశవ్యాప్తంగా 4వేలకు పైగా మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.99కే మూవీని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. థియేటర్ కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు చేస్తే జీఎస్టీ ఉండదని నిర్వాహకులు తెలిపారు.

Movies : సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.99కే మల్టీప్లెక్స్ స్క్రీన్లలో మూవీ చూసే ఛాన్స్!
New Update

MAI Has Good News For Movie Lovers : సినీ ప్రియులకు MAI అదిరిపోయే శుభవార్త చెప్పింది. సినిమా లవర్స్ డే (Cinema Lovers Day) సందర్భంగా మే 31న దేశవ్యాప్తంగా 4వేలకు పైగా మల్టీప్లెక్స్ స్క్రీన్లలో రూ.99కే మూవీని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. PVR-INOX, సినీపొలిస్, సిటీ ప్రైడ్, ఏషియన్, మిరాజ్, మూవీ టైమ్, M2K, డిలైట్ తదితర మల్టీప్లెక్స్ సినిమాలను ఎంజాయ్ చేయొచ్చని సూచించింది. బుక్ మై షో, పేటీఎం, అమెజాన్ పే లాంటి ఆన్‌లైన్ ప్లాట్ ఫాంలలో ఈ నెల 31న సినిమా టికెట్లు బుక్ చేసుకొనే వారు రూ.99తో పాటు జీఎస్టీ, కన్వీనియన్స్ ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఒకవేళ థియేటర్ కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు చేస్తే జీఎస్టీ, ఇతర చార్జీలు ఉండవని స్పష్టం చేసింది.

Also Read : ”సూసేకి అగ్గిరవ్వ మాదిరి’… పిచ్చెక్కిస్తున్న పుష్ప కపుల్ సాంగ్..!

#99-rupees-only #mai #pvr-inox #multiplex
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe