Telangana : మహిళా శక్తి క్యాంటీన్లకు శ్రీకారం

మహిళల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రెండేళ్లల్లో రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లను తెరవడానికి శ్రీకారం చుట్టింది. అమ్మ చేతి వంటలా అందించాలని ప్రభుత్వం పరయత్నాలు చేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు.

New Update
Telangana : మహిళా శక్తి క్యాంటీన్లకు శ్రీకారం

Mahila Shakti Canteens Starting In Telangana : రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్ల (Mahila Shakti Canteens) కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయం (Sachivalayam) లో రెండు క్యాంటీన్లను మంత్రి సీతక్క (Seethakka) ప్రారంభించారు. మహిళా శక్తి క్యాంటీన్లో సీతక్క సర్వపిండి కొనుగోలు చేశారు. అమ్మ చేతి వంటలా నాణ్యత పాటిస్తూ వంటలు అందించాలని మహిళా సంఘాలను సీతక్క కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రెండేళ్లలో జిల్లాకి ఐదు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు ఈ క్యాంటీన్ల నిర్వహణ అప్పగించనున్నారు. కలెక్టరేట్లు, ఆస్పత్రులు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక, పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయ వద్ద మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నారు. బిహార్లో 2018 నుంచి విజయవంతంగా కొనసాగుతున్న దీదీ కి రసోయ్ తరహాలో మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించనున్నారు.

క్యాంటీన్లను నిర్వహించే మహిళలకు జాతీయ హోటల్ మేనేజ్మెంట్ సంస్థలో శిక్షణ కూడా ఇస్తారు. మహిళా సంఘాలకు క్యాంటీన్ ప్రాంతాన్ని ప్రభుత్వ సంస్థలే ఉచితంగా లేదా తక్కువ అద్దెతో కేటాయించి ఒప్పందం చేసుకుంటారు. మహిళా క్యాంటీన్లను రెండు మోడళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. సుమారు రూ.15 లక్షలతో ఒక మోడల్ రూ.25 లక్షల పెట్టుబడితో మరో మోడల్ ఉంటుంది. జాతీయ గ్రామీణ కుటుంబాల మిషన్ గ్రాంటుతో పాటు కొంత లబ్ధిదారుల భాగస్వామ్యంతో పెట్టుబడి సమకూరుస్తారు. మొదటి మోడల్లో ఏడాదికి సుమారు రూ.7.5లక్షలు, రెండో మోడల్లో సంవత్సరానికి దాదాపు రూ.12.5 లక్షల లాభం ఉంటుందని ప్రభుత్వం అంచనా. సెర్ప్ అధికారుల బృందం బెంగాల్ సందర్శించి దీదీ కి రసోయ్ (Didi Ki Rasoi) నిర్వహణను అధ్యయనం చేశారు. బెంగాల్లో 199 దీదీ కీ రసోయ్ కేంద్రాలు రోజూ సుమారు లక్ష 84 వేల భోజనాలను సరఫరా చేస్తున్నాయి. దీదీ కి రసోయ్ కేంద్రాలు ఇప్పటి వరకు రూ.82 కోట్ల 50 లక్షల రూపాయల వ్యాపారం చేయగా అందులో వాటిని నిర్వహిస్తున్న క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్లకు రూ.10.57 లక్షల లాభాలు వచ్చినట్లు సెర్ప్ అధ్యయనంలో గుర్తించింది. దీదీ కి రసోయ్ మోడల్లోనే మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించాలని నిర్ణయించారు.

Also Read:Telangana: గూడెం అక్రమాలు రూ. 300 కోట్లు – ఈడీ

Advertisment
తాజా కథనాలు