/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-36-1.jpg)
Mahesh Babu Tweet On Prabhas Kalki Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనె అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కల్కి2898AD’ మూవీ (Kalki 2898 AD Movie) బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ఆడియన్స్ తో పాటూ సెలెబ్రిటీస్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై పలువురు స్టార్స్ పొగడ్తలు కురిపించగా.. తాజాగా ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం చేరిపోయాడు.
జస్ట్ వావ్..
తాజాగా 'కల్కి' సినిమా చూసిన మహేశ్ బాబు.. ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా తనదైన శైలిలో మూవీపై రివ్యూ ఇచ్చారు. " కల్కి ఓ అద్భుతం.. జస్ట్ వావ్. నాగ్ అశ్విన్ విజన్‌కు హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ కళాఖండంలా ఉంది. అమితాబ్ బచ్చన్ స్క్రీన్ ప్రజెన్స్‌కు ఎవరూ సరితూగరు. కమల్ హాసన్ ప్రతి పాత్రకు జీవం పోస్తారు. ప్రభాస్ గొప్ప క్యారెక్టర్‌లో చాలా సులభంగా నటించారు. దీపిక ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించారు. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతీ మూవీస్‌కు అభినందనలు" అని రాసుకొచ్చారు.
#Kalki2898AD… blew my mind away 🤯 🤯🤯Just wow!! @nagashwin7, hats off to your futuristic vision. Every frame is a piece of art 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2024
Also Read : ప్రముఖ గాయని ఇంట తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఆమె భర్త మృతి!
ఈ పోస్ట్‌కు దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ధన్యవాదాలు చెప్పారు. ‘మీ అభినందనలు అందుకోవడం మా టీమ్‌కు ఆనందంగా ఉంది’ అని రిప్లై ఇచ్చారు. నిర్మాణసంస్థ కూడా మహేశ్‌కు థ్యాంక్స్ చెప్పింది. మరోవైపు కల్కి కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. జూన్ 27 న రిలీజైన ఈ సినిమా ఇటీవలే రూ.900 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది.
Congratulations to @VyjayanthiFilms and the entire team on the phenomenal success 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) July 8, 2024