సాహిత్యం అని కబుర్లు చెబుతారు.. స్టేజీ ఎక్కి స్పీచ్‌లు దంచుతారు.. లేటైనా పర్లేదు.. మంచి విషయాలే జనాల్లోకి తీసుకెళ్లాలంటారు.. తీరా చూస్తే బూతులు పెట్టి పాట పాడించేశారు. పాటలను ఎంతగానే ప్రేమించే సగటు సినీ అభిమాని డైరెక్టర్ త్రివిక్రమ్(Trivikram)పై చేస్తున్న కామెంట్స్ ఇవి! మాటల మంత్రికుడిగా సినీ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ ఒక్క పాటతో విమర్శలపాలవుతున్నాడు. మహేశ్‌బాబు(Mahesh Babu) నటించిన 'గుంటూరుకారం(Guntur Kaaram)' సినిమాలో 'కుర్చీ మడతపెట్టి' సాంగ్‌పై సాహిత్య ప్రేమికులు పెదవి విరుస్తున్నారు. ఈ పాట వేరొకరు డైరెక్ట్ చేసిన సినిమా నుంచి వచ్చి ఉంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. పాటల్లో మంచి విలువలను జోడించి చిత్రికరీంచే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన మూవీ కావడంతో చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే గతంలో పాటల గురించి త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచ్‌లు, స్టేట్‌మెంట్లు అలా ఉన్నాయి మరి!
పాత వీడియోలు వైరల్:
'ఒక బూతు మాట మాట్లాడి అందరిని నవ్వించడం చాలా ఈజీ.. ప్రతివాళ్లు నవ్వుతారు కానీ ఆ వెంటనే మనల్ని తక్కువగా చూస్తారు.. అదే ఒక గొప్ప మాట మాట్లాడితే ముందు అర్థం అవ్వక అక్కడ నుంచి వెళ్లిపోవచ్చు కానీ.. ఆ వెళ్లిపోతున్న దారిలో మన మాట అర్థం అయితే ఫోన్ చేసి మరీ అభినందిస్తారు.. ఒక్కొ సారి.. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ.. మంచిదే చెబుదాంలే అనిపిస్తుంది.' ఇది ఓ సినిమా ఫంక్షన్‌లో త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు. నిజానికి ఇది చాలా అర్థవంతమైన కామెంట్స్. కానీ 'గుంటూరు కారం' సినిమాలోని ఓ బూతు ఉన్న పాటతోనే తన సినిమాను త్రివిక్రమ్ ప్రమోట్ చేసుకున్నారని ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు.
ఇక లెజండరీ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి స్టేజీపై త్రివిక్రమ్ చెప్పిన మాటలు ఎవరూ మర్చిపోలేరు. ఆడియన్స్ చూసే, అర్థమయ్యే పాటలే కాదు.. అర్థం చేసుకోవాలి అనే కోరికను కూడా పుట్టించే పాటలు రాయొచ్చని ఆయన పాటలు విన్నక తనకు అనిపించిందంటూ ఆనాడు త్రివిక్రమ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పటికీ అభిమానుల చెవుల్లో మారుమోగుతూనే ఉంది. 'కమర్షియల్ సినిమా అంటే.. దిగజారుడు సాహిత్యం కాదు.' అని సిరివెన్నల గురించి త్రివిక్రమ్ చెప్పిన మాటలు వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. పాటల గురించి అంత తెలిసిన త్రివిక్రమ్ ఒక్క కమర్షియల్ సినిమా కోసం దిగజారడం బాధ కలిగించందంటున్నారు ఆయన అభిమానులు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్(SS Thaman).. ఆయన్ను ఎలాగో ఏకీపారేస్తున్నారు. కానీ మొత్తం సినిమాకు కెప్టెన్ డైరెక్టరే కదా.. త్రివిక్రమ్ 'కుర్చీ మడతపెట్టి' లిరిక్స్‌కు అనుమతించాల్సింది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ప్రెగ్నెంట్ చేస్తే లక్షల రూపాయలిస్తాం.. ఈ న్యూస్ మొత్తం తెలుసుకుంటే షాక్ అవుతారు!
WATCH: