/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-21T184634.952-jpg.webp)
Mahesh babu Guntur Karam: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) మాటల మాంత్రికుడు, స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ పనులు బ్రేక్స్ లేకుండా బిజీ బిజీ గా సాగుతున్నాయి. ఇటీవలే మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి నిర్మాత నాగ వంశీ రీసెంట్ ఒక అప్డేట్ ఇచ్చారు. గుంటూరు కారంలో తర్వాత రాబోయే మూడు పాటలు అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలిపారు.
Also Read: Chiranjeevi: త్రిషపై నటుడి హాట్ కామెంట్స్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్..!
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమాలోని ఓ పాటకు సంబంధించి లీకైన షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ వీడియోలో మహేష్ బాబు ఓ పాటకు డాన్స్ వేస్తూ కనిపించారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు మహేష్ బాబు డాన్స్ ఇరగదీస్తున్నారు.. సూపర్ డాన్స్ అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.
I got from, some one status... Chudagane share chayalanipinchindi..
Mahesh sir steps kumesthunaru....
Today shooting @Ramoji_FilmCity#MaheshBabu𓃵#GunturKaaram pic.twitter.com/CByhzA1RR6— P M ESWAR NARAYANᶠᴬᴺ ᴮᴼʸ (@BinduMadavicult) November 21, 2023
Also Read: Roja Dance Video: డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. చిరంజీవి పాటకు రోజా దుమ్ములేపే డ్యాన్స్!