/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T192052.246-jpg.webp)
Guntur Kaaram Trending in OTT: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. బాక్స్ ఆఫీస్ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీలో కూడా హవా కొనసాగిస్తోంది.
టాప్ 1 ట్రెండింగ్ గా గుంటూరు కారం
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో (Netflix) స్ట్రీమ్ అవుతున్న గుంటూరు కారం రికార్డు వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఫిబ్రవరి 9 నుంచి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో టాప్ 1 ట్రెండింగ్ గా దూసుకెళ్తోంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ సంస్థ దీనికి సంబంధించి 'ట్రెండింగ్ #1' అంటూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు రావడంతో.. చాలా మంది ఈ సినిమాను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకసారి థియేటర్స్ లో చూసిన వారు కూడా మళ్ళీ చూస్తున్నారు. మొత్తనికి థియేటర్స్ లోనే కాదు ఓటీటీలోనూ గుంటూరు కారం ఘాటు బాగానే ఉంది.
Guntur Kaaram's SPICY fever is taking over as it is trending #1 on Netflix🌶️🔥
Guntur Kaaram, now streaming in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi.#GunturKaaramOnNetflix pic.twitter.com/8HmfmHbRgc— Netflix India South (@Netflix_INSouth) February 12, 2024
గుంటూరు కారం (Guntur Kaaram) చిత్రాన్ని హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించారు. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. మహేష్ బాబు జంటగా యంగ్ బ్యూటీ శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లి పాత్రలో కనిపించారు. ప్రకాష్ రాజ్, జయరాం, జగపతిబాబు, మురళి శర్మ, రావు రమేష్, ఈశ్వరి రావు, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు.