/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-55-3.jpg)
Mahesh Babu Emotional Post : టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేష్ బాబు (Mahesh Babu) పుత్రోత్సాహంలో మునిగితేలుతున్నారు. కుమారుడు గౌతమ్ ఘట్టమనేని (Gautham Ghattamaneni) గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
మహేష్ బాబు ఎమోషనల్ ట్వీట్
"నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నందుకు గౌతమ్ ఘట్టమనేనికి శుభాకాంక్షలు. ఇక పై రాబోయే చాఫ్టర్ వ్రాయవలసింది నువ్వే. గతంలో కంటే మరింత ప్రకాశవంతంగా ప్రకాశిస్తారని నాకు తెలుసు. నీ కలలను చేధిస్తూ ముందుకు వెళ్లు.. ఎల్లప్పుడూ నీకు మా ప్రేమ ఉంటుంది. తండ్రిగా నేను గర్వపడే రోజు ఇది అంటూ భావోద్వేగపూరిత పోస్ట్ పెట్టారు.
గ్రాడ్యుయేషన్ సెర్మనీ (Graduation Ceremony) లో కుమారుడు గౌతమ్ తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
View this post on Instagram
Music Shop Murthy: 'మ్యూజిక్ షాప్ మూర్తి' వచ్చేస్తున్నాడు.. జూన్ 14న రిలీజ్ - Rtvlive.com