Music Shop Murthy : 'మ్యూజిక్ షాప్ మూర్తి' వచ్చేస్తున్నాడు.. జూన్ 14న రిలీజ్

టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. శివ పాలడుగు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
Music Shop Murthy : 'మ్యూజిక్ షాప్ మూర్తి'  వచ్చేస్తున్నాడు.. జూన్ 14న రిలీజ్

Music Shop Murthy Is Coming : యంగ్ బ్యూటీ చాందిని చౌదరి (Chandini Chowdary), సీనియర్ నటుడు అజయ్ ఘోష్ (Ajay Gosh) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మ్యూజిక్ షాప్ మూర్తి'. 50 ఏళ్ళ డీజే కావాలని కలలుకనే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామా ఈ సినిమా. శివ పాలడుగు తెరకెక్కించిన చిత్రాన్ని ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన మ్యూజిక్ షాప్ మూర్తి టీజర్ (Music Shop Murthy Teaser), గ్లిఫ్మ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్

మ్యూజిక్ షాప్ మూర్తి జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఇంకో మూడు వారాల్లో ప్రేక్షకులకు అద్భుతమైన ఎమోషనల్‌ ట్రీట్‌ ఇవ్వబోతున్నామంటూ ట్వీట్ చేశారు. ఇది సకుటుంబంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటైర్టెనర్‌ అని తెలిపారు మేకర్స్. ఈ చిత్రంలో చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

మ్యూజిక్ షాప్ మూర్తి స్టోరీ 

50 ఏళ్ళ వయసులో డీజే (DJ) కావాలని కలలకనే మ్యూజిక్ షాప్ ఓనర్ మూర్తి పాత్రలో అజయ్ ఘోష్ నటించారు. మూర్తి తన లక్ష్యాన్ని సాధించడంలో అతనికి సహాయం చేసే ఓ ఇన్‌స్పైరింగ్‌ రోల్‌లో చాందిని చౌదరి నటించింది. ఇక మూర్తి డీజే ఎలా అయ్యాడు..? మూర్తి కలను నెరవేర్చడంలో చాందిని పాత్ర ఏంటి అనేది సినిమా కథ.

 

Amma Paata 2024 : అమ్మపాట.. అందరి నోట.. ఎన్ని మిలియన్ల వ్యూసో తెలుసా? - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు