MS Dhoni: క్రికెట్ అకాడమీ పేరుతో ధోనీకి టోకరా...15కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..ఇద్దరిపై కేసు..!!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన మాజీ వ్యాపార భాగస్వాములు రూ.15 కోట్ల మేర మోసం చేశారంటూ శుక్రవారం కోర్టును ఆశ్రయించాడు.ధోని ఫిర్యాదుతో అర్కాస్పోర్ట్స్ యజమాని మిహిర్ దివాకర్, సౌమ్యా విశ్వాస్ లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.

MS Dhoni: క్రికెట్ అకాడమీ పేరుతో ధోనీకి టోకరా...15కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..ఇద్దరిపై కేసు..!!
New Update

న్యూఇయర్ వేడుకలు ముగియడంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) దుబాయ్ నుంచి స్వదేశానికి చేరుకున్నాడు. వచ్చిరాగానే ధోనీ కోర్టును ఆశ్రయించాడు. క్రికెట్ అకాడమీ(Cricket Academy) పేరుతో తనను మోసం చేసి రూ. 15కోట్లు కాజేసిన ఇద్దరిపై రాంచీ కోర్టు(Ranchi court)లో కేసు పెట్టాడు. ధోనీ ఫిర్యాదుతో అర్కాస్పోర్ట్స్ ((Aarka Sports) ) యజమాని మిహిర్ దివాకర్, సౌమ్యా విశ్వాస్ (Soumya Vishwas)) లపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేసేందుకు మిహిర్ దివాకర్ ((Mihir Diwakar)) 2017లో ధోనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. నా పేరు మీద అనేక చోట్ల క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేసిన తర్వాత కంపెనీ లాభాల భాగస్వామ్య ఒప్పందాన్ని పాటించలేదు. దీని వల్ల తనకు రూ.15 కోట్ల నష్టం వాటిల్లిందని ధోనీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ధోనీ తరపు లాయర్ దయానంద్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ధోనీకి, కంపెనీకి మధ్య 2017లో ఒప్పందం కుదిరింది."అర్కా స్పోర్ట్స్ ద్వారా ఫ్రాంచైజీ ఫీజు చెల్లించి లాభాలను పంచుకోవాలని ఒప్పందం నిర్దేశించింది. కానీ కంపెనీ అలా చేయలేదు. ధోనీ కంపెనీకి అనేకసార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఎటువంటి చర్య తీసుకోలేదు. లాభంలో వాటా ఇవ్వలేదు" అని లాయర్ చెప్పారు. నిందితులిద్దరూ ఇప్పటివరకు సుమారు రూ.15 కోట్ల మేర నష్టం కలిగించారని మహేంద్ర సింగ్ ధోనీ తరపు న్యాయవాది తెలిపారు. నిందితులు ఇంతకుముందు ధోనీతో కలిసి పనిచేశారు. వారు కలిసి రంజీ ట్రోఫీ కూడా ఆడారు. ఈ కేసులో తొలి విచారణ నేడు కాగా, తదుపరి విచారణ జనవరి 20న జరగనుంది.

ఇది కూడా చదవండి: అయోధ్య వెళ్లే భక్తులకు..టీటీడీ గుడ్ న్యూస్..ఏంటో తెలుసా?

కాగా టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఎంఎస్ ధోనీ...ఐపీఎల్ లోనూ సత్తా చాటుతున్నాడు. కుర్రాళ్లతో కూడిన చెన్నై సూపర్ కింగ్స్ ను 16వ సీజన్ లో చాంపియన్ గా నిలిపాడు. తన మార్క్ కెప్టెన్సీతో చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదోసారి ట్రోఫీని అందించి రికార్డ్ క్రియేట్ చేశారు. 17వ సీజన్ లోనూ ధోనీ బరిలోకి దిగుతున్నాడు. అయితే మోకాలీ సర్జరీ నుంచి ఈ మధ్యే కోలుకున్న ధోనీ 2024 ఎడిషన్ లో టోర్నీ మొత్తం అడుతారా లేదంటే కొన్ని మ్యాచులకే పరిమితం అవుతాడా అనేది తెలియాల్సి ఉంది.

#jharkhand #dhoni #cheating #mahendra-singh-dhoni #mrs-dhoni
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe