BRS: మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో దుమ్మురేపిన బీఆర్‌ఎస్‌.. NCP, కాంగ్రెస్‌లో వణుకు..?

మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 50కు పైగా స్థానాలు గెలుచుకుంది. వచ్చే ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌, NCP ఓట్లు చీల్చే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.

BRS: మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో దుమ్మురేపిన బీఆర్‌ఎస్‌..  NCP, కాంగ్రెస్‌లో వణుకు..?
New Update

ఓట్లు చీలడం అంటే ఏదో చిన్న విషయం కాదు.. ఫలితాలే తారుమారువుతాయి. గెలిచే పార్టీ ఓడిపోతుంది... ఓడే పార్టీ గెలుస్తుంది. చీల్చే ఓట్లకు అంత పవర్‌ ఉంటుంది. చరిత్ర కూడా ఇదే చెబుతోంది. ఉద్యమ పార్టీగా ఏర్పాటై.. జాతీయపార్టీల్లో సత్తా చాటాలని తమ పార్టీ పేరు మార్చుకున్న బీఆర్‌ఎస్‌ ఆ దిశగా వేగంగా అడుగలేస్తున్నట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఖాతా తెరవడమే కాదు.. ఏకంగా 54 పంచాయతీలను గెలుచుకుంది. షోలాపూర్‌లో 17, జల్‌గావ్‌లో 13, బీడ్, రత్నగిరిలో 2, అహ్మద్‌నగర్‌లో ఒక్కో గ్రామ పంచాయతీని గెలుచుకున్నట్లు మహారాష్ట్ర బీఆర్‌ఎస్ కిసాన్ సెల్ చీఫ్ మాణిక్ కదమ్ తెలిపారు.

ఎవరికి మైనస్:
వచ్చే ఏడాది మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరుకు అక్కడ ఏ పార్టీతోనూ బీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకోలేదు. ప్రస్తుతం అక్కడ శివసేన షిండేసేన- బీజేపీ కలిపి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. అంతకముందు శివసేన-NCP-కాంగ్రెస్‌ కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపాయి. శివసేన వర్గంలో చీలిక తర్వాత బీజేపీ మద్దతులో ఏక్‌నాథ్‌ షిండే సీఎంగా ఎన్నికయ్యారు. దేశ రాజకీయాలు వేరు మహారాష్ట్ర రాజకీయాలు వేరు.. అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం.. క్రికెట్‌ మ్యాచ్‌ను తలపించేలా అక్కడ రాజకీయాలు రక్తి కట్టిస్తుంటాయి. వాటిని మరింత ఉత్కంఠగా మార్చేందుకు కేసీఆర్‌ రెడీ ఐనట్లుగా అనిపిస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మహారాష్ట్రలో పోటీ చేయనుంది. ఇది కాంగ్రెస్‌, NCPకు మైనస్‌గా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఓట్లు చీల్చుతుందా?
నిజానికి 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఖాతా తెరిచింది. రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. దక్షిణభారత్‌ నుంచి వచ్చి పార్టీ మహారాష్ట్రలో ఖాతా తెరవడం అదే తొలిసారి. ఇక 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒవైసీ పార్టీ ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకుంది. ఔరంగాబాద్ పార్లమెంట్ స్థానాన్ని MIM గెలుచుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక తాజాగా మహారాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఖాతా తెరడం.. వచ్చే ఏడాది 288 అసెంబ్లీ ఎన్నికల స్థానాల్లో బీఆర్‌ఎస్‌ పోటి చేయాలని ప్లాన్ చేస్తుండడంతో కాంగ్రెస్‌, NCP ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. నిజానికి శరద్‌ పవార్‌ పార్టీకి గ్రామీణ ప్రాంతాల్లో మంచి పట్టు ఉంది. అయితే తెలంగాణ సరిహద్దు జిల్లాలకు చెందిన ఓటర్లు బీఆర్‌ఎస్‌ వైపు ఉంటే ఓట్లు చీలే ప్రమాదముంటుంది. ఇది పరోక్షంగా కాంగ్రెస్‌కు గట్టి దెబ్బే. ఎందుకంటే కాంగ్రెస్‌-NCP-ఉద్ధవ్‌ శివసేన వచ్చే ఏడాది కలిసి పోటి చేస్తాయన్న ప్రచారముంది. అటు MIM లాగానే కాంగ్రెస్‌ ఓట్లను బీఆర్‌ఎస్‌ చీల్చితే అది హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. మరి చూడాలి ఆ టైమ్‌కి సీన్‌, సినారియోలు ఎలా ఉంటాయో..!

Also Read: జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల

WATCH:

 

#panchayat-election #cm-kcr #telangana-elections-2023 #congress #maharashtra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి