ఐశ్వర్య రాయ్ లాంటి కండ్లు కావాలంటే రోజూ చేపలు తినండి... మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు...! By G Ramu 21 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి మహారాష్ట్ర బీజేపీ మంత్రి(minister) విజయ్ కుమార్ గవిట్(vijay kumar gavit) వివాదాస్పద వ్యాఖ్యలు(Controversial remarks) చేశారు. చేపలు తింటే ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రోజూ చేపలు తింటే ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కండ్ల లాగా మన కండ్లు కూడా చాలా అందంగా తయారవుతాయన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు, ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు మండి పడుతున్నాయి. ధూలే జిల్లాలోని అంతుర్లీలో నిర్వహించిన మత్స్యకారుల సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... రోజూ చేపలు తినే వారి చర్మం చాలా మృదువుగా అందంగా తయారవుతుందన్నారు. రోజు చేపలు తింటే కండ్లలో ఓ మెరుపు వస్తుందన్నారు. దీంతో మిమ్మల్ని చూసే వెంటనే మీకు అట్రాక్ట్ అయి పోతారంటూ ఆయన వ్యాఖ్యానించారు. మీకు ఐశ్వర్యరాయ్ గురించి చెప్పానా అని వాళ్లతో అన్నారు. ఆమె మంగళూరులో సముద్ర తీరానికి సమీపంలో నివసిస్తుందన్నారు. ఆమె రోజూ తన ఆహారంలో చేపలను క్రమం తప్పుకుండా తీసుకుంటుందన్నారు. ఆమె కండ్లను మీరు ఎప్పుడైనా చూశారా? అని ప్రశ్నించారు. రోజూ చేపలు తింటే మీ కండ్లు కూడా ఆమె కండ్ల లాగే అందంగా తయారవుతాయన్నారు. చేపల్లో కొన్ని రకాల నూనెలు వుంటాయన్నారు. అందువల్ల చేపలు తింటే మీ శరీరం చాలా మృదువుగా తయారవుతుందన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంత్రి వ్యాఖ్యలపై ఎన్సీపీ ఎమ్మెల్యే అమోల్ మిత్కారీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఇలాంటి అసంబద్ద వ్యాఖ్యులు చేయకుండా మత్స్యకారుల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే నితేశ్ రాణా కూడా స్పందించారు. తాను కూడా రోజు చేపలు తింటానని వెల్లడించారు. తన కండ్లు కూడా ఐశ్వర్య రాయ్ లాగా కావాల్సిందన్నారు. ఈ విషయాన్ని గవిట్ సాహెబ్ ను అడిగి తెలుసుకుంటానన్నారు. దీనిపై ఆయన ఏమైనా పరిశోధనలు చేశారో వివరాలను ఆయన్ని అడిగి తెలుసుకుంటానని చెప్పారు. #bollywood #bjp #ncp #actress #vijay-kumar-gavit #minister #aishwaraya-rai #miss-world మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి