Maha Lakshmi Scheme Zero-Ticket: తెలంగాణలో కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు, ట్రాన్స్‌జెండర్‌లకు వయసుతో సంబంధం లేకుండా ఉచిత ప్రయాణం (Free Bus) కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న మధ్యాహ్నం మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే గత వారం రోజులకుగా వీరికి ఎలాంటి టికెట్ ఇవ్వడం లేదు. అయితే ఇప్పడు తాజాగా జీరో టికెట్లు అమల్లోకి వచ్చాయి. గురువారం అర్థరాత్రి 12 దాటిన తర్వాత మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తున్నారు. ఈ టికెట్లు ఇచ్చే మిషన్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను పొందుపరిచారు (TSRTC). బుధవారం రాత్రి ప్రయోగాత్మకంగా జీరో టికెట్ ఇవ్వడాన్ని నిర్వహించారు. చివరికి సాఫ్ట్‌వేర్ విజయవంతం కావడంతో.. ఇప్పుడు జీరో టికెట్ అమల్లోకి వచ్చింది.
పండుగలు జాతర్లకు నడిచే స్పేషల్ బస్సుల్లో కూడా మహిళలకు జీరో టికెట్లు ఇవ్వనున్నారు. అయితే తెలంగాణలో నివసించే మహిళలకు మాత్రమే ఈ ఫ్రీ బస్ స్కీమ్ వర్తిస్తుంది. ఇక శుక్రవారం నుంచి మహిళలలు బస్ కండక్టర్లకు తప్పనిసరిగా ఆధార్ కార్డు (Aadhar Card) లేదా ఓటర్ ఐడీ లేదా మరేదైన గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. మరో విషయం ఏంటంటే జిరాక్స్ కాపీ చూపించినా కూడా పర్వాలేదని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రోజున జీరో టికెట్ ఇవ్వడం మొదటిరోజు కావడంతో ఎవరైన మహిళలలు తమ గుర్తింపు కార్టులు మర్చిపోతే.. మళ్లీ మరిచిపోవద్దని హెచ్చరించి జీరో టికెట్ ఇవ్వాలని అధికారులు కండక్టర్లకు ఆదేశించారు. ఆ తర్వాత అంటే రేపటి నుంచి ఎవరైన తమ గుర్తింపు కార్డు మరిచిపోతే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని చెబుతున్నారు.
Also Read: నేడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడ్డాక తొలిసారి!
ఇదిలా ఉండగా.. ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల ఆర్టీసీ నష్టపోయే ఆదాయాన్ని ప్రభుత్వమే రీయింబర్స్ చేసి సమకూర్చుతుంది. ప్రతినెల ఎంతమంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించారు. ఆర్టీసీ ఎంత ఆదాయాన్ని కోల్పోయింది అనే దాని ఆధారంగా ప్రభుత్వం ఖర్చులు భరించనుంది. మహాలక్ష్మీ పథకం (Maha Lakshmi Scheme) కోసం ఆర్టీసీకి ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క రూ.374 కోట్లు విడుదల చేశారు. అలాగే బకాయి ఉన్న ఇతర మొత్తాలను కూడా అందించి ఆర్టీసీ సంస్థను ఆదుకోవాలని ఎన్‌ఎంయూ నేతలు కోరారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి లాగే ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలుసుకునేందుకు 15 రోజులకొకసారి కార్మిక వాణిని నిర్వహించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.