Kaleshwaram Project : అన్నారం కంటే మేడిగడ్డలోనే భారీ నష్టం - డీజీ రాజీవ్ రతన్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ ప్రారంభించింది. ఇప్పటికే మంత్రుల బృందం పర్యటించి లోపాలను ఎత్తి చూపింది. మరోవైపు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కూడా విచారణ చేపట్టారు.

New Update
Kaleshwaram Project : అన్నారం కంటే మేడిగడ్డలోనే భారీ నష్టం - డీజీ రాజీవ్ రతన్

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీ రాజీవ్ రతన్ ఆధ్వర్యంలో వరుసగా రెండోరోజు తనిఖీలు కొనసాగాయి. పంప్‌హౌస్‌లు, బ్యారేజ్‌ల దగ్గర క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు, కన్నెపల్లి పంప్ హౌస్ లోనూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. పంప్‌హౌస్‌లు నిర్మించిన మేఘాలోనూ తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీ రాజీవ్ రతన్ మాట్లాడుతూ అన్నారం కంటే మేడిగడ్డ బ్యారేజ్‌లోనే భారీ నష్టం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయి పరిశీలనపై త్వరలో నివేదిక ఇస్తామని వెల్లడించారు. అన్నారం బ్యారేజీ, మేడిగడ్డ బ్యారేజీని పోల్చి చూశామని.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలకు సంబంధించిన పూర్తి రికార్డులను హార్డ్ డిస్క్‌లను వారం రోజుల క్రితమే తమ బృందం స్వాధీనం చేసుకుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే మళ్లీ తాము క్షేత్ర పరిశీలనకు రావడం జరిగిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లోని లోపాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకొంటుందని స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు