Madhya Pradesh Elections: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంచలన హామీలు..!! సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన ఆ పార్టీ ఎలాగైన మళ్లీ అధికారంలో రావాలన్న ఉద్దేశ్యంతో సంచలన హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. ప్రతిఒక్కరికీ రూ. 25లక్షల ఆరోగ్య బీమాతోపాటు రూ. 500 వంట గ్యాస్ సిలిండర్ వంటి 59 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. By Bhoomi 17 Oct 2023 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జ్యోతిరాదిత్య సింథియా తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన ఆ పార్టీ ఎలాగైన మళ్లీ అధికారంలో రావాలన్న ఉద్దేశ్యంతో సంచలన హామీలను మేనిఫెస్టోలో చేర్చింది. ప్రతిఒక్కరికీ రూ. 25లక్షల ఆరోగ్య బీమాతోపాటు రూ. 500 వంట గ్యాస్ సిలిండర్ వంటి 59 హామీలతో ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. మేనిఫెస్టోలో చేర్చిన హామీలెంటో చూద్దాం. 1. 'జై కిసాన్ కృషి రిన్ మాఫీ యోజన' (వ్యవసాయ రుణ మాఫీ పథకం) రాష్ట్రంలో కొనసాగుతుంది. 2 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ చేస్తామన్నారు. 2. నారీ సమ్మాన్ నిధి పథకం కింద మహిళలకు నెలకు రూ.1500/- ఇస్తాం. 3. గృహ గ్యాస్ సిలిండర్లు రూ. 500/-లకు అందిస్తాం. 4. ఇందిరా గృహ జ్యోతి యోజన కింద, 100 యూనిట్లు మాఫీగా ఇవ్వబడతాయి. 200 యూనిట్లు సగం రేటుతో ఇవ్వబడతాయి. 5. పాత పెన్షన్ స్కీమ్ 2005 OPSని ప్రారంభిస్తాం. 6. సాగునీటి కోసం రైతులకు 5-హార్స్ పవర్ విద్యుత్ ఉచితంగా అందిస్తాం. 7. రైతుల బకాయి విద్యుత్ బిల్లులను మాఫీ చేయడం. 8. రైతుల ఉద్యమం మరియు విద్యుత్తుకు సంబంధించిన తప్పుడుచ నిరాధారమైన కేసులను ఉపసంహరించుకోవడం. 9. బహుళ వికలాంగుల పెన్షన్ మొత్తం రూ. 2000/-కి పెంపు. 10. కుల గణన నిర్వహిస్తాం. 11. ప్రభుత్వ సేవలు, పథకాల్లో OBCలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 12. సాగర్‌లో సెయింట్ శిరోమణి రవిదాస్ పేరు మీద స్కిల్ అప్‌గ్రేడేషన్ యూనివర్సిటీ రానుంది. 13. టెండు ఆకుల లేబర్ రేటు స్టాండర్డ్ బ్యాగ్‌కి రూ. 4000/- ఉంటుంది. 14. పఢావో పఢావో పథకం కింద 1 నుండి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు నెలకు రూ. 500/-, 9-10వ తరగతి వరకు నెలకు రూ. 1000/- పిల్లలకు నెలకు రూ. 1500/- అందజేయబడుతుంది. 1 15. పాఠశాల విద్య ఉచితం. 16. కాంగ్రెస్ హయాంలో చేసిన పెసా చట్టం గిరిజన నోటిఫైడ్ ప్రాంతాల్లో అమలు చేయబడుతుంది. 17. యువతకు వాళ్ల అర్హతను బట్టి రూ. 1500 నుంచి రూ. 3 వేల వరకు రెండేళ్ల పాటు నిరోద్యోగ భృతి చెల్లిస్తామని కాంగ్రెస్ హామి ఇచ్చింది. మధ్యప్రదేశ్: -మొత్తం అసెంబ్లీ స్థానాలు - 230 -అధికారంలో ఉన్న పార్టీ - బీజేపీ -2018లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు (కాంగ్రెస్ 114, బీజేపీ 109, బీఎస్పీ 2, ఎస్పీ 1, స్వతంత్రులు 4) -అధికార పార్టీకి గడువు తేదీ - డిసెంబర్ 17, 2023 #WATCH | Bhopal: Congress releases the party's manifesto for the Madhya Pradesh elections Madhya Pradesh party president Kamal Nath, party leader Digvijaya Singh and other leaders present on the occasion. pic.twitter.com/bwi6Wgr8oS — ANI (@ANI) October 17, 2023 #madhya-pradesh-elections #madhya-pradesh-assembly-elections-2023 #chhattisgarh-assembly-elections-2023 #5-state-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి