Madhavi Latha : అసదుద్దీన్‌ను వెంటాడుతున్న మాధవీలత.. ఇంటికి వచ్చి ఫోన్ చేస్తామంటూ!

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత తన పరిధిలో ఓటు మిస్‌ అయిన వారికోసం ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. క్యూ ఆర్ స్కాన్‌ ఆధారంగా ఓటు గల్లంతైనా వారు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అసదుద్దీన్‌ ఓడించేందుకు ఆమె ఇలా చేస్తుందనే కామెంట్స్ వినపడుతున్నాయి.

New Update
Madhavi Latha : అసదుద్దీన్‌ను వెంటాడుతున్న మాధవీలత.. ఇంటికి వచ్చి ఫోన్ చేస్తామంటూ!

Hyderabad : హైదరాబాద్ బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలత(Kompella Madhavi Latha) పోలింగ్(Polling) ముగిసినా తన పోరాటం ఆపట్లేదు. ఓల్డ్ సిటీ ఓటింగ్ లో అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్న ఆమె..హైదరాబాద్‌ పార్లమెంట్ పరిధిలో ఓటు మిస్‌ అయిన వారికోసం ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేశారు. క్యూ ఆర్ స్కాన్‌ ఆధారంగా ఓటు గల్లంతైనా వారు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదు పత్రంలో పేరు, నియోజకవర్గం, ఓటరు ఐడీ, నంబర్‌, వయస్సు వివరాలు నమోదు చేయాలని కోరారు. ఈ సమాచారంతో తాము స్వయంగా ఇంటికి వచ్చి, లేదా ఫోన్ చేసి ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. 'మీ ఓటు మీ హక్కు' అన్నారు. దీంతో ఓవైసీ అసదుద్దీన్‌ ఓటమి లక్ష్యంగానే మాధవీలత పావులు కదుపుతున్నారని, ఎలాగైనా గెలవాలనే తపనతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే చర్చ హాట్ టాపిక్ గా మారింది.

Also Read : వివాహేతర సంబధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపించిన భార్య

ఈ మేరకు చివరి గంటలో అనూహ్యంగా పోలింగ్ పెరగడానికి కారణం మొత్తం నియోజకవర్గం పరిధిలో ఎంఐఎం భారీగా రిగ్గింగ్ చేసిందని బుధవారం ఆరోపించారు. స్థానిక నేతలతో ఎంఐఎం నాయకులు ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేయించారని అన్నారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి రీ పోలింగ్ చేయాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు. రీ పోలింగ్ కోసం తాము ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు