Macherla Violence:
మాచర్ల(Macherla) నియోజకవర్గంలో ఘర్షణలకు(Macherla Violence) కారణం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలే అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎంపీ లావు ఎన్నికలకు రెండు రోజుల ముందే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నారాయణస్వామిని కారంపూడి సీఐగా రప్పించారన్నారు. కారంపూడి సీఐ పరిధిలోని కారంపూడి, రెంటచింతల మండలాల్లోనే టీడీపీ నేతలు రిగ్గింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు ఎన్నికలలో టీడీపీ నేతలకు పూర్తిగా సహకరించారన్నారు.
టీడీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాల్లో ఒకరిద్దరు పోలీసులను పెట్టారని ఫైర్ అయ్యారు. వైసీపీకి అనుకూలంగా ఉన్న గ్రామాల్లో పెద్దఎత్తున పోలీసులను మోహరించారన్నారు. టీడీపీ నేతల రిగ్గింగ్ పై ఎస్పీకి ఫోన్ చేసినా.. పక్క గ్రామంలో ఉండికూడా స్పందించలేదన్నారు.
కమ్మ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్న ఒప్పిచర్ల, చింతపల్లి, తుమృకోట, పాలువాయి గేటు గ్రామాల్లోనే గొడవలు జరిగాయన్నారు. తన గెలుపును అడ్డుకోవాలని కుట్రలు చేశారని.. అయినా గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు పిన్నెల్లి. వైసీపీ నేతలపై దాడులకు పాల్పడిన వారిని వదిలేదిలేదని హెచ్చరించారు.