AP : ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు యమ లక్కీ.. నాడు వైసీపీలో ఎమ్మెల్యేలు, నేడు టీడీపీలో మంత్రులు!

చంద్రబాబు కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రుల్లో ఆనం రామానారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథి కూడా ఉన్నారు.ప్రస్తుతం వీరి గురించి పెద్ద చర్చే నడుస్తుంది. వీరంతా అదృష్టవంతులు మరొకరు లేరని అంతా అనుకుంటున్నారు. అసలు వీరి గురించి అలా ఎందుకు అనుకుంటున్నారో ఈ కథనంలో చదివేయండి!

New Update
AP : ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు యమ లక్కీ.. నాడు వైసీపీలో ఎమ్మెల్యేలు, నేడు టీడీపీలో మంత్రులు!

TDP : ఏపీలో కొత్త కేబినెట్‌ ఏర్పాడటానికి ఇంకా కొంత సమయం మాత్రమే ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి నేడే శుభముహుర్తం. ఈరోజు ప్రమాణ స్వీకారం (Oath Ceremony) చేయబోతున్న మంత్రుల్లో ఆనం రామానారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy) కూడా ఉన్నారు.

ప్రస్తుతం వీరి గురించి పెద్ద చర్చే నడుస్తుంది. వీరంతా అదృష్టవంతులు మరొకరు లేరని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆనం కుటుంబానికి నెల్లూరు (Nellore) లో రాజకీయ పలుకుబడి బాగా ఉంది. అయితే ఆయన్ని గత ముఖ్యమంత్రి పక్కన పెట్టి ఓ యువ రాజకీయ వేత్తను ముందుకు తీసుకుని వచ్చారనే ఆరోపణలున్నాయి.

దీంతో ఆనంలో అసంతృప్తి ఏర్పడింది. ఎన్నికల సమయంలో అసలు వైసీపీ లో ఆనం ఉండలేకపోయారు. దీంతో టీడీపీలో చేరి ఆత్మకూరు బరిలో నిలిచి, గెలిచి ఇప్పుడు మంత్రి పదవిని దక్కించుకున్నారు.

ఇక ఇంకో మంత్రి కొలుసు పార్థసారథి విషయానికి వస్తే ..ఆయన కూడా లక్కీ వ్యక్తి అనే చెప్పుకొవచ్చు. ఈయన రాజకీయ ప్రస్థానం చాలా సుదీర్ఘమైనది. 2019 లో వైసీపీ తరుఫున పెనమలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో కొలుసుకు టికెట్‌ ఇవ్వడానికి జగన్‌ నిరాకరించారు.

దీంతో ఆయన టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. బాబు కేబినెట్‌ లో మంత్రి పదవిలోకి రాబోతన్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి పదవులు చేపట్టడంతో ఇప్పుడు వీరి గురించి హాట్ టాపిక్ అయ్యింది.

Also read: టీఎస్ లాసెట్ ఫ‌లితాలు ఈ నెల 13న విడుద‌ల‌!

Advertisment
తాజా కథనాలు