Bullet Train Project: లక్కీ ఛాన్స్.. ఆ కంపెనీకే బుల్లెట్ రైలు ప్రాజెక్ట్..

దేశంలో చేపట్టనున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్​ సిస్టమ్‌ను ఏర్పాటు చేసే అవకాశం లార్సెన్ & టూబ్రో (L & T) కంపెనీకి దక్కింది. ముంబై-అహ్మదాబాద్ హైస్పైడ్‌ రైల్ ప్రాజెక్టు పూర్తయ్యాక ఈ సిస్టమ్‌ వల్ల బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

Bullet Train Project: లక్కీ ఛాన్స్..  ఆ కంపెనీకే బుల్లెట్ రైలు ప్రాజెక్ట్..
New Update

దేశంలో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం ఎలక్ట్రిఫికేషన్​ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం వచ్చిందని లార్సెన్ & టూబ్రో (ఎల్ అండ్ టీ) కంపెనీ తెలిపింది. ఇందుకోసం 508 కిలోమీటర్ల పరిధిలో ఎల్ అండ్ టీ కంపెనీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనుంది. ముంబై-అహ్మదాబాద్ హైస్పైడ్‌ రైల్ ప్రాజెక్టుకు ఈ ఎలక్ట్రిఫికేషన్ సిస్టమ్‌ను ఈ కంపెనీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ రూట్ నిర్మాణం పూర్తయ్యాక.. ఈ సిస్టమ్‌ వల్ల బుల్లెట్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

Also read: అయోధ్య రాముడికి 1,265 కిలోల భారీ హైదరాబాద్ లడ్డు

అయితే ఈ ప్రాజెక్టుకు జపాన్ ఇంటర్నేషనల్ కో–ఆపరేషన్ అనే ఏజెన్సీ నిధులు సమకూరుస్తున్నట్లు ఎల్ అండ్ టీ చెప్పింది. ఇదిలాఉండగా.. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు మహారాష్ట్రలో భూసేకరణ పూర్తయిందని ఇటీవలే రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇప్పటికే 8 నదులపై వంతెనల నిర్మాణం పూర్తైందని చెప్పారు. అలాగే ప్రస్తుతం ముంబై-థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్నట్లు తెలిపారు.

Also read: అయోధ్య రాముడికి 1,265 కిలోల భారీ హైదరాబాద్ లడ్డు

ఇదిలాఉండగా.. దేశంలో ఇదే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు. దీని కారిడర్ పొడవను మొత్తం 508,17 కిలోమీటర్లు. 251 కిలోమీటర్ల వరకు పిల్లర్లు ఉంటాయి. అలాగే 103 కి.మీ వరకు ఎలివేటెడ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం పూర్తైనట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే ఈ బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే.. అహ్మదాబాద్ నుంచి ముంబయ్‌కి కేవలం 2.58 గంటల్లోనే చేరుకోవచ్చు.ఈ ప్రాజెక్టు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది.

#telugu-news #bullet-train #bullet-train-project
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe