Rain Alert For AP: ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) అమరావతి విభాగం వెల్లడించింది. మరోవైపు ఉపరితలం ఆవర్తనం, రుతుపవన ద్రోణి కూడా కొనసాగుతున్నాయని, మంగళవారం ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయని వివరించింది.
తిరుపతి, శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, పల్నాడు, అనకాపల్లి, కృష్ణా, బాపట్ల,కాకినాడ, ఉభయ గోదావరి, ఎన్టీఆర్, ఏలూరు, పార్వతీపురం మన్యం, కోనసీమ, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ తెలిపింది.
కాగా, వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
Also Read: టైటానిక్‌లా బీజేపీ..మునిగిపోవాలంటే మోదీనే బెస్ట్!