Modi: టైటానిక్‌లా బీజేపీ..మునిగిపోవాలంటే మోదీనే బెస్ట్‌!

'బీజేపీలో ఉన్న మనతో పాటు, మన పార్టీ కూడా టైటానిక్ షిప్ లాగా మునిగిపోవాలని కోరుకుంటే, అందుకు ఆ షిప్‌ కి సారథ్యం వహించడానికి నరేంద్రమోదీయే ఉత్తమమైనవాడని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.

New Update
Modi: టైటానిక్‌లా బీజేపీ..మునిగిపోవాలంటే మోదీనే బెస్ట్‌!

BJP Subramanian Swamy: ప్రధాని నరేంద్రమోదీపై (PM Modi), బీజేపీ పై ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. 'బీజేపీలో (BJP) ఉన్న మనతో పాటు, మన పార్టీ కూడా టైటానిక్ షిప్ లాగా మునిగిపోవాలని కోరుకుంటే, అందుకు ఆ షిప్‌ కి సారథ్యం వహించడానికి నరేంద్రమోదీయే ఉత్తమమైనవాడు. బీజేపీ శాశ్వతంగా మునిగిపోయేలా బీటలు వారుతోందని ఉపఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి' అని అన్నారు.

కొద్ది రోజుల క్రితం వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమికేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయాన్ని సాధించింది. ఇండియా కూటమి (INDIA) పదిచోట్ల గెలిచింది. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇందులో అత్యధిక సీట్లు ఇండియా కూటమి అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

Also Read: విశాఖలో మాజీ సైనికుడి గొంతు కోసి హత్య!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు