Olympics 2024 : పంచులతో అదరగొట్టి.. క్వార్టర్స్‌ కు చేరి.. పతకానికి అడుగుదూరంలో లవ్లీనా

పారిస్ ఒలింపిక్స్‌లో భారత బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా బోర్గోహైన్ ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. మహిళల 75 కిలోల విభాగంలో సున్నివా హాఫ్‌స్టాడ్‌ను 5-0 తో ఓడించింది. క్వార్టర్స్‌లో నెగ్గి సెమీస్‌ చేరుకుంటే లవ్లీనా మరో పతకం ఖాయం చేసినట్టే.

Olympics 2024 : పంచులతో అదరగొట్టి.. క్వార్టర్స్‌ కు చేరి.. పతకానికి అడుగుదూరంలో లవ్లీనా
New Update

Olympics 2024 : ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్‌ (Paris Olympics 2024) లో భారత బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా బోర్గోహైన్ ప్రిక్వార్టర్స్‌లో విజయం సాధించి మరో పతకం దిశగా అడుగులు ముందుకు వేసింది. మహిళల 75 కిలోల విభాగం ప్రిక్వార్టర్స్‌ పోరులో భాగంగా తన ప్రత్యర్థి సున్నివా హాఫ్‌స్టాడ్‌ను 5-0 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు ప్రవేశించింది. ఈ విజయం భారత క్రీడా ప్రేమికులందరిలో ఆనందాన్ని నింపింది. లవ్లీనా యొక్క ఈ అద్భుత ప్రదర్శన భారతదేశానికి మరో పతకం రాబట్టే అవకాశాన్ని మరింత పెంచింది.

లవ్లీనా బోర్గోహైన్ ఎవరు?

అస్సాం (Assam) కు చెందిన లవ్లీనా బోర్గోహైన్ (Lovlina Borgohain) భారతదేశం (India) లోని అత్యంత ప్రతిభావంతులైన బాక్సర్లలో ఒకరు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి దేశానికి గర్వకారణమైంది. తన అద్భుతమైన పంచ్‌లతో ద్వారా ప్రత్యర్థులను తేలికగా ఓడిస్తూ ప్రస్తుత ఒలింపిక్స్ లోనూ అదరగొడుతుంది.

Also Read : లక్ష్య సేన్‌ అద్భుతం.. ప్రీ క్వార్టర్స్‌కు

చైనా బాక్సర్ తో..

ఒలింపిక్స్‌కు ముందు వరకూ పామ్‌ లేమితో సతమతమైన లవ్లీనా.. కీలక టోర్నీలో మాత్రం సత్తా చాటుతూ భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసే దిశగా ముందుకు సాగుతోంది. కాగా లవ్లీనా క్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ చైనా బాక్సర్‌ లి ఖియాన్‌తో తలపడనుంది. ఆగస్టు 4న ఈ మ్యాచ్‌ జరుగనుంది.





#lovlina-borgohain #paris-olympics-2024 #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe