Weight Increases: స్వీట్స్‌తో బరువు పెరుగుతుందని భయపడుతున్నారా?..దానికి బదులు ఇవి తినండి బరువు తగ్గాలనుకునే వారు స్వీట్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి డిన్నర్ తర్వాత స్వీట్లు తినాలని అనిపిస్తే మాత్రం ఖర్జూరం, పెరుగు-బెల్లం, చియా గింజలు, బెర్రీలు, కొబ్బరి క్రీమ్ వంటి తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Weight Increases: స్వీట్లు తినడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు స్వీట్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే రాత్రి డిన్నర్ తర్వాత స్వీట్లు తినాలని అనిపిస్తే మాత్రం కొన్ని పదార్థాలను తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఖర్జూరం: ఖర్జూరం సహజంగా తీపిగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ ఉంటాయి. దీన్ని తినడం వల్ల స్వీట్లపై మోజు తొలగిపోయి ఎక్కువ కాలం స్వీట్లకు దూరంగా ఉండేందుకు తోడ్పడుతుంది. కావాలంటే ఖర్జూరాలను స్మూతీగా చేసుకుని తీసుకోవచ్చు. పెరుగు-బెల్లం: పెరుగులో ప్రోటీన్, కాల్షియం ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే బెల్లం ఒక సహజ స్వీటెనర్. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక గిన్నె పెరుగులో కొద్దిగా బెల్లం కలిపి తింటే బరువు తగ్గుతారని నిపుణులు అంటున్నారు. చియా గింజలు: చియా గింజలు పుష్కలంగా ప్రోటీన్, ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. చియా గింజలను కొబ్బరి పాలు లేదా బాదం పాలలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం అందులో పండ్లు, తేనె, డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసి డెజర్ట్‌లా తీసుకుంటే ఎంతో ఆరోగ్యమని వైద్యులు చెబుతున్నారు. బెర్రీలు: బెర్రీలు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్‌బెర్రీలలో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా వీటిలో చక్కెర పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. వీటిని పెరుగులో కలిపి కూడా తీసుకోవచ్చు. కొబ్బరి క్రీమ్: కోకోనట్ క్రీమ్ చాలా మందికి ఇష్టమైన స్వీట్. ఇది కొబ్బరి పాలు, యాలకులు, డ్రై ఫ్రూట్స్ నుంచి తయారు చేస్తారు. ఇది తక్కువ సంతృప్త కొవ్వును కూడా కలిగి ఉంటుంది. దీన్ని ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు. ఇది కూడా చదవండి: డ్రై ఐస్ తింటే నోట్లో రక్తం ఎందుకు వస్తుంది? గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #best-health-tips #weight-increases మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి