Crime: సంక్రాంతి పండటపూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పొద్దున్నే లేచి ఇంటిముందు వాకిట్లో ముగ్గులేస్తున్న వారిని ఓ లారీ (lorry) మృత్యువుల వేటాడింది. కుటుంబంతో కలిసి సంబరాలు చేసుకునేందుకు ఉత్సాహంగా పనులు చేసుకుంటున్న అక్కాచెల్లెళ్లపైకి లారీ దూసుకెళ్లింది. స్థానికులతోపాటు తెలుగు రాష్ట్రాలను కలిచివేసిన ఈ భయంకరమైన సంఘటన ఏలూరు (Elur) జిల్లా మండవల్లి మండలం కానుకొల్లులో జరిగింది.
టీడీపీ నేత కూతుళ్లు..
ఈ మేరకు స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కానుకొల్లు గ్రామానికి చెందిన టీడీపీ (TDP) నేత పంగిళ్ల నాగబాబు (Nagababu) కూతుర్లు రోడ్డు పక్కనే ఉన్న తమ ఇంటి ముందు వాకిట్లో పొద్దున్నే లేచి సంక్రాంతి ముగ్గులు, రంగులు వేస్తున్నారు. అయితే ఉదయమే గుడివాడ నుంచి కైకలూరు వైపు వెళ్తున్న ఓ ఇటుకల లారీ అనూహ్యంగా వారిపైకి దూసుకెళ్లింది. దీంతో పెద్ద కూతురు తేజస్విని (16) (Tejaswini) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. చిన్న కూతురు పల్లవీ దుర్గ (pallavi durga)కు (18) తీవ్ర గాయాలవగా స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మృతురాలు తేజస్విని, పల్లవీ దుర్గ ముదినేపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్ (inter) చదువుతున్నారు.
ఇది కూడా చదవండి : Makara Sankranti: సంక్రాంతి మనతో పాటు ఈ దేశాలు కూడా జరుపుకుంటాయి
అదుపులోకి డ్రైవర్..
ఇక ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను ప్రకాశ్‌రావుగా (prakash) గుర్తించి అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే గ్రామస్థులు, సన్నిహితులు, తెదేపా నాయకులు పెద్ద సంఖ్యలో నాగబాబు ఇంటికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ ను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్థులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు.