Karnataka : ప్రజ్వల్ రేవణ్ణపై లుక్‌ అవుట్ నోటీసులు

సెక్స్ స్కాండల్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ (ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మీద లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది సిట్ బృందం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్లకు లుక్‌ జౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Karnataka : ప్రజ్వల్ రేవణ్ణపై లుక్‌ అవుట్ నోటీసులు
New Update

Elections : ఎన్నికలు(Elections) జరుగుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కర్ణాట(Karnataka) కలో సెక్స్ స్కాండల్ కేసు(Sex Scandal Case) దుమారం రేగుతోంది. మాజీ ప్రధాని మనువడు, జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna) మీద లైంగిక ఆరోపణలు వెల్లువెత్తడమే కాకుండా దానికి సంబంధించిన ఆధారాలు బయటకు వచ్చాయి. ఇతని మీద కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఈ విషయాన్ని కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ప్రజ్వల్‌ కేసుకు సంబంధించి ప్రత్యేక సిట్ బృందాన్ని నియమించింది. ఇప్పటికే ఇతన్ని జేడీ (ఎస్) పార్టీ ను బహిష్కరించారు. దానికి తోడు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అతను పాల్గొనకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు తాజాగా ఇతని మీద లుక్ అవుట్ నోటీసులు ఆరీ చేశారు. లైంగిక ఆరోపణలు బయటకు వచ్చిన తర్వాత ప్రజ్వల్ జర్మనీ పారిపోయాడు. అందుకే ఇప్పుడు సిట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్లకు లుక్ అవుట్ నోటీసులు పంపించింది.

అతన్ని పట్టుకుని తీరుతాం..

ప్రజ్వల్ రేవణ్ణను ఇండియా(India) తిరిగి రప్పిస్తామని చెబుతోంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం ఐపీఎస్‌ బి.కె.సింగ్‌ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో ఇద్దరు మహిళా ఎస్పీలు కూడా ఉన్నారు. ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ కేసులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని చెప్పేసింది. ఇక సిట్ టీమ్ వీడియోలకు సంబంధించిన పెన్‌డ్రైవ్‌లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపుతారు. మిగిలిన ఆధారాలను సేకరిస్తారు. వీటిల్లో కనుక నిజాలు నిరూపితం అయితే ప్రజ్వల్‌ను సిట్ టీమ్ ఇండియా తీసుకు వస్తుంది. అయితే ఈ కేసును ఏళ్ల ఏళ్ళు సాగదీయకుండా తొందరగా విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారురాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర. అంతేకాదు ఈ కేసులో అవసరమైతే బాధితులు, ఫిర్యాదుదారులకు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని తెలిపారు.

Also Read:Hyderabad: మళ్లీ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చిరుత కలకలం

#karnataka #prajwal-revanna #sex-scandal
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe