Mohammed Shami : 2023 ప్రపంచ కప్ తర్వాత చీలమండ గాయంతో ఇబ్బంది పడుతున్న స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) కోలుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఈ గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్ కు దూరమైన బౌలర్.. ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు.
ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షమీ.. 'ఇప్పటికీ మైదానంలో సాధన ప్రారంభించలేదు. కానీ ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. ఇంగ్లాండ్(England) తో టెస్టు సిరీస్‌లో(IND vs ENG) ఆడాలనే పట్టుదలతో ఉన్నా. మెనేజ్ మెంట్ నిర్ణయం కోసం కూడా ఎదురుచూస్తున్నా'అన్నాడు.
అలాగే అంతర్జాతీయ టీ20 జట్టులో చోటు దక్కడంపై కూడా స్పందించిన ఆయన.. ‘టీ20 ఫార్మాట్ గురించి చర్చ వచ్చినప్పుడల్లా.. నేను సెలక్టర్ల దృష్టిలో ఉన్నానో లేదో నాకు తెలియడం లేదు. కానీ వచ్చే టీ20 ప్రపంచకప్ ముందు ఐపీఎల్(IPL) లో ఆడతా. ఇందులో రాణిస్తే వరల్డ్ కప్(World Cup) లో అవకాశం దక్కుతుందేమో చూడాలి. నా బౌలింగ్ లయ అందుకునేందుకు ఈ లీగ్ ఉపయోగపడుతుంది. మేనేజ్‌మెంట్ తీసుకోవాలని భావిస్తే మాత్రం సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాను' అని షమీ స్పష్టం చేశాడు.
ఇది కూడా చదవండి : BRS: ‘బీఆర్ఎస్’ను ‘టీఆర్ఎస్’గా మార్చండి.. అధిష్టానానికి వినతులు
ఇక షమీతో తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉందని, గత కొన్నేళ్లుగా పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని బీసీసీఐ(BCCI) వర్గాలు వెల్లడించాయి. అతి త్వరలో మేనేజ్‌మెంట్, సెలక్టర్లు షమీతో చర్చిస్తారు. ఐపీఎల్, టెస్టు సిరీస్‌లు కాకుండా ఎంత మొత్తం క్రికెట్ ఆడాలని భావిస్తున్నాడనేది అప్పుడే తేలనుందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ టీమిండియా(Team India) పేసర్ మహ్మద్ షమీకి ఇటీవలే అర్జున అవార్డు లభించింది. రాష్ట్రపతి ద్రౌపది మార్ము(Droupadi Murmu) చేతుల మీదుగా షమీ దేశ 2వ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకున్నాడు.