Shami : షమీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సిరీస్‌కు రెడీ! ఇండియన్ స్టార్ క్రికెట్ ప్లేయర్ మహ్మద్ షమీ చీలమండ గాయంనుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు తెలిపాడు. 'ఇప్పటికీ మైదానంలో సాధన ప్రారంభించలేదు. కానీ ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడాలనే పట్టుదలతో ఉన్నాను' అని స్పష్టం చేశాడు. By srinivas 11 Jan 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Mohammed Shami : 2023 ప్రపంచ కప్ తర్వాత చీలమండ గాయంతో ఇబ్బంది పడుతున్న స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) కోలుకుంటున్నట్లు చెప్పాడు. అయితే ఈ గాయం కారణంగా సౌతాఫ్రికా సిరీస్ కు దూరమైన బౌలర్.. ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు పూర్తి ఫిట్‌నెస్ సాధించడంపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. Thank you so much bhai love you ❤️❤️❤️ https://t.co/CS9Uiz1czX — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) January 9, 2024 ఈ మేరకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షమీ.. 'ఇప్పటికీ మైదానంలో సాధన ప్రారంభించలేదు. కానీ ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా. ఇంగ్లాండ్(England) తో టెస్టు సిరీస్‌లో(IND vs ENG) ఆడాలనే పట్టుదలతో ఉన్నా. మెనేజ్ మెంట్ నిర్ణయం కోసం కూడా ఎదురుచూస్తున్నా'అన్నాడు. అలాగే అంతర్జాతీయ టీ20 జట్టులో చోటు దక్కడంపై కూడా స్పందించిన ఆయన.. ‘టీ20 ఫార్మాట్ గురించి చర్చ వచ్చినప్పుడల్లా.. నేను సెలక్టర్ల దృష్టిలో ఉన్నానో లేదో నాకు తెలియడం లేదు. కానీ వచ్చే టీ20 ప్రపంచకప్ ముందు ఐపీఎల్(IPL) లో ఆడతా. ఇందులో రాణిస్తే వరల్డ్ కప్(World Cup) లో అవకాశం దక్కుతుందేమో చూడాలి. నా బౌలింగ్ లయ అందుకునేందుకు ఈ లీగ్ ఉపయోగపడుతుంది. మేనేజ్‌మెంట్ తీసుకోవాలని భావిస్తే మాత్రం సెలక్షన్‌కు అందుబాటులో ఉంటాను' అని షమీ స్పష్టం చేశాడు. ఇది కూడా చదవండి : BRS: ‘బీఆర్ఎస్’ను ‘టీఆర్ఎస్’గా మార్చండి.. అధిష్టానానికి వినతులు ఇక షమీతో తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉందని, గత కొన్నేళ్లుగా పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడని బీసీసీఐ(BCCI) వర్గాలు వెల్లడించాయి. అతి త్వరలో మేనేజ్‌మెంట్, సెలక్టర్లు షమీతో చర్చిస్తారు. ఐపీఎల్, టెస్టు సిరీస్‌లు కాకుండా ఎంత మొత్తం క్రికెట్ ఆడాలని భావిస్తున్నాడనేది అప్పుడే తేలనుందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. Thank you so much for this award. It means so much to me and I am truly grateful This award inspires me to continue to pursue my passion with even greater enthusiasm. I am honored to have received this award . I take great pride in having one of the best childhoods since the best… pic.twitter.com/HVQeb3LVxv — 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@MdShami11) January 10, 2024 ఈ టీమిండియా(Team India) పేసర్ మహ్మద్ షమీకి ఇటీవలే అర్జున అవార్డు లభించింది. రాష్ట్రపతి ద్రౌపది మార్ము(Droupadi Murmu) చేతుల మీదుగా షమీ దేశ 2వ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకున్నాడు. #england #india #mohammed-shami #world-cup మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి