Life style:స్టైలిష్ గా కనిపించాలంటే వీటిని వాడాల్సిందే...

స్టైల్ గా కనిపించాలని ఎవరు అనుకోరు. ఏ వయనువారైనా అందంగా, మంచి లుక్ తో కనిపించాలని అనుకుంటారు. ముఖ్యంగా ఆడవారు. అలా కనిపించాలంటే 5 వస్తువులు మాత్రం మీ దగ్గర కచ్చితంగా ఉంచుకోవాలని చెబుతున్నారు ఫ్యాషన్ నిపుణులు.

New Update
Life style:స్టైలిష్ గా కనిపించాలంటే వీటిని వాడాల్సిందే...

బట్టలు ఎలా ఉన్నా కొన్ని యాక్సెసరీస్ ఉంటే మన లుక్కే మారిపోతోంది. ఫ్యాషన్ ప్రపంచంలో ఆడవారికి ప్రత్యేక స్థానం ఉంటుంది. మరీ ముఖ్యంగా యాక్సెసరీస్, బట్టల ఎంపిక విషయంలో కొన్ని టిప్స్ ఫాలో అవుతారు. ఇందులో మహిళలు ధరించే నగలు, హెయిర్ స్టైల్స్, హ్యాండ్ బ్యాగ్స్, బట్టలు, వాచెస్, హై హీల్స్ ఇలా ఎన్నో.. ఎన్నెన్నో ఉంటాయి. అయితే.. ఇలాంటి వాటిలో మరికొన్ని వస్తువులు కూడా మీరు ఫ్యాషన్‌గా కనిపించేందుకు హెల్ప్ చేస్తాయి. అవేంటో మీరూ చూసేయండి.

Also Read:ఆస్తమాకు చెక్ పెట్టే మొక్కలు..మీ ఇంట్లో ఇవి ఉండేలా చూసుకోండి

స్లిమ్ బెల్ట్..

వడ్డాణాలకు మోడ్రన్ రూపం స్లిమ్ బెల్ట్. వీటిని దాదాపు అన్ని డ్రెస్ ల మీదా వేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చీరల మీదకు కూడా వీటిని పెట్టుకుంటున్నారు. దీని వల్ల బాడీషేప్ చక్కగా కనిపిస్తుంది. అటూ సాంప్రదాయమైన డ్రెస్సెస్, ఇటు మోడ్రన్ డ్రెస్సెస్‌.. ఇలా ఎలాంటి డ్రెస్సెస్‌పైనా కూడా సెట్ అయిపోతాయి. ఇవి బ్లేజర్స్‌పై కూడా బాగుంటాయి. ప్రజెంట్ మార్కెట్లో చాలా మోడల్స్, మెటల్స్‌ ఇలా ఎలా అయినా దొరుకతాయి. అయితే బ్లేజర్స్‌పై వాడాలంటే బ్లాక్, హాఫ్ వైట్‌లోవి ఎంచుకోవచ్చు.

సన్ గ్లాసెస్..

సన్ గ్లాసెస్ అటూ ఫ్యాషన్‌గా కనిపిస్తూనే ఇటు కళ్ళని కూడా కాపాడుతుంది. ఇది చాలా మంది కేవలం బీచెస్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే పెట్టుకుంటారు. కానీ, అలా కాదు ఎండలో బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా వేసుకోవచ్చు. అయితే, అందుకోసం మీరు చక్కగా మీకు సూట్ అయ్యే సన్ గ్లాసెస్‌ని ఎంచుకోవచ్చు.

వాచెస్..

వాచెస్ కూడా ఫ్యాషన్‌ ట్రెండ్‌ని పెంచుతాయి. మనలో చాలా మంది డ్రెస్సెస్‌కి సూట్ అయ్యే వాచెస్‌ని పెట్టుకుంటారు. దీని వల్ల మరింత ఫ్యాషన్‌గా కనిపిస్తారు. అందుకోసం మంచి అందమైన, బ్రాండెడ్ వాచెస్ ఎంచుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా మంది స్మార్ట్ వాచెస్ వాడుతున్నారు. అలా అయినా వాడొచ్చు. లేదా బ్రాస్‌లెట్స్‌ని కూడా ట్రై చేయొచ్చు.

మినిమం జ్యువెలరీ..

అదే విధంగా నెక్‌పీస్, బ్యాంగిల్స్, చెవిపోగులు కూడా మనల్ని ఫ్యాషన్ ఐకానిక్‌గా కనిపిస్తాయి. చెవులు, చేతులు, మెడపై ఇలా వీటిని కూడా స్టేట్‌మెంట్ పీసెస్ ఎంచుకోవాలి.

హ్యాండ్ బ్యాగ్స్..

హ్యాండ్ బ్యాగ్స్ అనేవి కూడా మీ ఫ్యాషన్‌ని ఎలివేట్ చేస్తాయి. కాబట్టి, మంచి హ్యాండ్ బ్యాగ్ ట్రై చేయండి. ఇందులో బ్రాండ్‌వి అయితే బావుంటాయి. అందుకోసం డబ్బు ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి.. మన బడ్జెట్‌ని కూడా ఎంచుకోవచ్చు. అదే విధంగా, ఒకటే బ్యాగ్ కాకుండా ఓ రెండు మూడు కొని పెట్టుకోండి. అవి అకేషన్‌ని బట్టి స్టైల్ చేయొచ్చు. ఇందులో మీ బ్యూటీ ప్రోడక్ట్స్‌ని కూడా ఈ బ్యాగులోనే పెట్టుకునేలా ప్లాన్ చేయండి. అందుకోసం ముందుగానే అన్ని ఆలోచించి వాటిని కొనడం మంచిది.

Advertisment
Advertisment
తాజా కథనాలు