Telangana Game Changer : మహబూబ్‌నగర్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!

ఈ లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డి.కె.ఆరుణ, బీఆర్ఎస్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Telangana Game Changer : మహబూబ్‌నగర్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!

Mahabubnagar : పాలమూరుగా చారిత్రక నేపథ్యం వున్న మహబూబ్‌నగర్‌ లోక్‌సభ(Lok Sabha) సీటు తెలంగాణ(Telangana) లోపాటు కర్నాటక(Karnataka) కల్చర్‌ని ఒంటబట్టించుకున్న ప్రాంతం. కృష్ణా నది పరివాహక ప్రాంతానికి ఆనుకునే వున్నా ఎడారిని తలపించే ప్రాంతాలెన్నో ఇక్కడ వున్నాయి. వలసజీవుల జిల్లాగా పేరున్న మహబూబ్‌నగర్‌ జైపాల్‌ రెడ్డి వంటి రాజకీయ దురంధురులను దేశానికి అందించింది. రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ కలిగిన ఈ నియోజకవర్గంలో ప్రతీ ఎన్నిక ఆసక్తి రేపుతూనే వుంది.

2019లో బీఆర్ఎస్ అబ్యర్ధి మన్నె శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్ధి డి.కె.అరుణ(DK Aruna) రెండో స్థానంలో నిలిచారు.

ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, బీజేపీ నుంచి డి.కె.ఆరుణ, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్నారు.

publive-image

కాంగ్రెస్
చల్లా వంశీచంద్ రెడ్డి - మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడిరాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో స్పెషల్ ఇన్వైటీగా ఉన్నారు.

బీజేపీ
డి.కె.ఆరుణ - బలమైన కుటుంబ రాజకీయ నేపథ్యం ఉంది. 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. మాజీ మంత్రి.

బీఆర్ఎస్
మన్నె శ్రీనివాస్ రెడ్డి - సిట్టింగ్ ఎంపీ.

గెలుపు అవకాశం: బీజేపీ

publive-image

Also Read : గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా? జాగ్రత్త అంటున్న ఆర్బీఐ

రీజన్స్‌:
1) మోదీ కరిష్మా.. డి.కె.అరుణ సొంత ఇమేజ్‌.. సంఘ్‌ పరివార్‌ సంస్థలు బలంగా వుండడం బీజేపీకి సానుకూలాంశం.
2) కుటుంబ రాజకీయ నేపథ్యం డి.కె.అరుణకి కలిసొచ్చే అంశం.
3) అరుణ రాజకీయ చాతుర్యం వల్ల ప్రస్తుతం పైచేయి సాధిస్తుంది. కానీ సీఎం సొంత జిల్లా కావడం, అందరూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే ఇక్కడ్నించి ప్రాతినిధ్యం వహిస్తూ వుండడం అరుణను టెన్షన్‌ పెడుతున్నాయి.
4) కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌ రెడ్డి విజయాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తుది ఫలితంపై ప్రభావం చూపొచ్చు.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు