Khammam : ఖమ్మం.. తెలంగాణ(Telangana) కు, ఆంధ్రా ప్రాంతానికి గుమ్మంలా వున్న ఖమ్మం భిన్న సంస్కృతులున్న లోక్‌సభ సీటు. ఓ వైపు ఆంధ్రా సెటిలర్లు.. ఇంకోవైపు చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దులో వున్న గిరిజనులు..ఇలా ఖమ్మంలో పాగా వేయాలంటే రాజకీయ చతురత చూపించాల్సిన అవసరం ఎంతో వుంది. వామపక్షాల ప్రాబల్యం ఇంకా చెప్పుకోదగిన స్థాయిలో వుందీ అంటే అది ఖమ్మంలోనే అని చెప్పాలి.
2019లో బీఆర్ఎస్ అభ్యర్ధి నామా నాగేశ్వరరావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి రేణుకా చౌదరి(Renuka Chowdary) రెండోస్థానంలో నిలిచారు.
ప్రస్తుతం కాంగ్రెస్(Congress) నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, బీజేపీ నుంచి వినోద్‌రావు, బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు పోటీలో ఉన్నారు.
కాంగ్రెస్
రామసహాయం రఘురాంరెడ్డి - మాజీ మంత్రి సురేందర్‌రెడ్డి కుమారుడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బంధువు. విక్టరీ వెంకటేష్ వియ్యంకుడు.
బీజేపీ
వినోద్ రావు - తొలిసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న నేత.
బీఆర్ఎస్
నామా నాగేశ్వరరావు - సిట్టింగ్ ఎంపీ, లోక్‌సభ(Lok Sabha) లో బీఆర్‌ఎస్ పక్ష నేత.
గెలుపు అవకాశం: కాంగ్రెస్
Also Read : Telangana Game Changer : సికింద్రాబాద్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
రీజన్స్:
1) ఖమ్మం లోక్‌సభ పరిధిలో 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, మరో స్థానంలో కాంగ్రెస్ హెల్ప్‌తో గెలిచిన సీపీఐ ఉండటం ప్లస్ పాయింట్
2) ఖమ్మంలో బీఆర్‌ఎస్ చాలా బలహీనపడింది. నామా నాగేశ్వర్ సొంతంగా కష్టపడుతున్నారు. క్యాస్ట్ పోలరైజేషన్ కోసం ట్రై చేస్తున్నారు.
3) నియోజకవర్గంలో బీజేపీ ఉనికి నామమాత్రం.
4) కాంగ్రెస్ దిగ్గజాలున్న నియోజకవర్గం.. పొంగులేటి పట్టుబట్టి తన బంధువు రఘురామిరెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. భట్టి విక్రమార్క, తుమ్మలను కలుపుకుని పని చేస్తున్నారు.
5) తుమ్మల మనస్పూర్తిగా రఘురామిరెడ్డికి సహకరిస్తే విక్టరీ కన్ఫామ్.. లేకపోతే కమ్మ సామాజికవర్గం ఓట్లు నామావైపు మళ్ళినా.. రఘురామిరెడ్డి తక్కువ మెజారిటీతో అయినా గెలుస్తాడు.
6) రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఊపున్నపుడు కూడా ఖమ్మం కాంగ్రెస్ వైపే.. ఇపుడు స్థానికంగా అధికారంలో వుండడం ప్లస్ పాయింట్.