Telangana Game Changer: కరీంనగర్ లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!

ఈ లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ లో కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు, బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి బి.వినోద్‌కుమార్ బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి?.. రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Telangana Game Changer: కరీంనగర్ లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!

Lok Sabha Election Results Analysis By RTV Ravi Prakash:  కరీంనగర్‌.. దేశానికి ప్రధానితోపాటు ఎందరో రాజకీయ దురంధరులను అందించిన ప్రాంతమిది. పీవీ నరసింహారావు వంటి రాజకీయ చాణక్యులతో పాటు శ్రీపాద రావు, చొక్కారావు వంటి బడా రాజకీయవేత్తలను అందించిన ఏరియా. తెలంగాణ ఉద్యమానికి మొదట్నించి ఊపిరినిచ్చిన ప్రాంతం. కేసీఆర్‌కు అండగా నిలబడి.. జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన లోక్‌సభ సీటిది.

2019లో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ విజయం సాధించారు. బీఆర్‌ఎస్ క్యాండిడేట్ బి.వినోద్‌కుమార్ రెండో స్థానానికి పరిమితం అయ్యారు.
2024లో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్‌రావు, టీఆర్ఎస్ నుంచి బి.వినోద్‌కుమార్ బరిలో ఉన్నారు.

publive-image

బీజేపీ:
బండి సంజయ్ - ఆర్‌ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ ఉన్న నేత. సిట్టింగ్ ఎంపీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.

కాంగ్రెస్:
వెలిచాల రాజేందర్‌రావు - గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడారు. చాన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి, ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు.

టీఆర్ఎస్:
బి.వినోద్‌కుమార్ - తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సన్నిహితుడు, రెండు సార్లు ఎంపీగా గెలిచారు.

గెలిచే అవకశం: బీజేపీ

publive-image

రీజన్స్‌:
1) సిట్టింగ్‌ ఎంపీగా బండికి సానుకూలత. మోదీ కరిష్మా అయోధ్య ప్రాణప్రతిష్ట తర్వాత బాగా పెరిగింది.
2) బీసీ ఓటుబ్యాంకు పోలరైజ్‌ అవుతోంది.
3) బీఆర్‌ఎస్‌ బాగా వీక్‌ అయ్యింది. ఇది వినోద్‌కు పెద్ద మైనస్‌ పాయింట్‌.
4) కాంగ్రెస్‌ పార్టీ బీసీకి టికెట్‌ ఇస్తే పరిస్థితి వేరేగా వుండేది.
5) మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో ఎంపీ అయినా... ప్రస్తుతం హుస్నాబాద్‌, కరీంనగర్‌లలో మాత్రమే ప్రభావం చూపగలడు.
6) బీఆర్‌ఎస్‌కు పడే ఓట్ల సంఖ్య ప్రభావం చూపుతుంది. దీని వల్ల బండి సంజయ్‌ మెజారిటీ తగ్గడం, పెరగడం వుంటుంది.
7) సంఘ్‌ పరివార్‌ సంస్థలు బలంగా వుండడం బీజేపీకి సానుకూలాంశం.

Advertisment
Advertisment
తాజా కథనాలు