Telangana Game Changer : చేవెళ్ళలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!

ఈ లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ళలో కాంగ్రెస్ నుంచి జి.రంజిత్ రెడ్డి, బీజేపీనుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. వారి పాజిటీవ్ అంశాలు ఏంటి? రవిప్రకాశ్ పూర్తి విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

Telangana Game Changer : చేవెళ్ళలో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!
New Update

Chevella : చేవెళ్ళ.. హైదరాబాద్‌(Hyderabad) శివార్లలోని మూడు అర్బన్‌ సెగ్మెంట్లు.. వికారాబాద్‌ జిల్లాలోని మూడు రూరల్‌ సెగ్మెంట్లలో విస్తరించి వుంది ఈ లోక్‌ సభ(Lok Sabha)  సీటు. ఐటీ పరిశ్రమ విస్తరించి వున్న ప్రాంతం ఈ నియోజకవర్గంలో అధికంగా వుంది. అర్బన్‌, రూరల్‌ కాంబినేషన్‌లో వున్న చేవెళ్ళ లోక్‌సభ సీటును గెలుచుకోవడం ఎవరికైనా సవాలు వంటిదే.

2019లో బీఆర్ఎస్(BRS) అభ్యర్ధి రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు.

ప్రస్తుతం కాంగ్రెస్(Congress) నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి, బీజేపీ(BJP) నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బరిలో ఉన్నారు.

publive-image

Also Read : సికింద్రాబాద్‌లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ సంచలన లెక్కలివే!

కాంగ్రెస్

జి. రంజిత్ రెడ్డి - సిట్టింగ్ ఎంపీ. పారిశ్రామికవేత్త.

బీజేపీ

కొండా విశ్వేశ్వర్ రెడ్డి - మాజీ ఎంపీ. పారిశ్రామిక వేత్త.

బీఆర్ఎస్

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ - ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకుడు. బలమైన బీసీ నేత. మాజీ ఎమ్మెల్సీ.

బీజేపీ గెలిచే అవకాశం.

publive-image

రీజన్స్‌:

1) అర్బన్‌ సెగ్మెంట్లలో బీజేపీ పట్ల సానుకూలత కనిపిస్తోంది. కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి కుటుంబం లెగసీ వికారాబాద్‌, చేవెళ్ళ ప్రాంతాలపై ప్రభావం. వెరసి విజయావకాశం ఎక్కువ. గతంలో ఓసారి ఇక్కడ గెలిచారు. అదో ప్లస్‌ పాయింట్‌.

2) నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలున్నా.. ఆ పార్టీ అభ్యర్థి కాసానికి పెద్దగా సానుకూలంగా కనిపించడం లేదు.

3) సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌ రెడ్డిపై వ్యతిరేకత కొండాకు పాజిటివ్‌ ఓటుగా మారుతోంది.

4) కొండా క్లీన్‌ ఇమేజ్‌.. మోదీ చరిష్మా.. అర్బన్‌ ఏరియాలో ఎక్కువ ఓట్లు ఉండడం బీజేపీ విజయానికి కారణంగా కనినిపిస్తున్నాయి.

publive-image

#lok-sabha-elections-2024 #ravi-prakash #chevella #telangana-game-changer
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe