BJP MP : కరీంనగర్(Karimnagar) బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బండి సంజయ్(Bandi Sanjay) మరోసారి బరిలో ఉన్నారు. ఎన్నికల అఫిడవిట్(Election Affidavit) లో తన ఆస్తులు, వ్యక్తిగత వివరాలను సమర్పించారు. సొంత ఇల్లు, భూములు లేనట్లు వెల్లడించారు. కుటుంబ ఆస్తుల విలువ రూ.1.12 కోట్లు ఉన్నాయన్నారు సంజయ్. స్థిరాస్తులు లేవని..తన దగ్గర 3 కార్లు, 2 బైక్‌లు ఉన్నట్లు తెలిపారు. తన సతీమణికి 43 తులాల బంగారం ఉందన్నారు.
రూ.13.4 లక్షల అప్పు..
ప్రస్తుతం తన దగ్గర రూ.5 లక్షల నగదు, తన భార్య దగ్గర లక్ష రూపాయలు మాత్రమే ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వాహనాల కోసం 13.4 లక్షల అప్పులు తీసుకున్నామన్నారు. తనకు గుంట భూమి కూడా లేదని స్పష్టం చేశారు. తనపై మొత్తం 41 క్రిమినల్ కేసులున్నాయన్నారు. ఆ వివరాలను స్పష్టంగా వివరించారు సంజయ్.
సికింద్రాబాద్(Secunderabad) బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) పోటీ చేస్తున్నారు. పార్టీ నేతలతో కలిసి నామినేషన్ వేశారు. ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తులు, వ్యక్తిగత వివరాలను పొందపరిచారు. తన కుటుంబానికి 19.22 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు కిషన్ రెడ్డి. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని తెలిపారు. కుటుంబానికి బ్యాంకుల్లో డిపాజిట్లు, సుమతి సీడ్స్‌లో షేర్లు, వైష్ణవి అసోసియేట్స్‌లో పెట్టుబడులు ఉన్నాయన్నారు.
వీ అండ్ టీ అసోసియేట్‌లో వాటా..
వీ అండ్ టీ అసోసియేట్‌లో వాటా ఉన్నట్లు వెల్లడించారు కిషన్ రెడ్డి. 1995లో కొనుగోలు చేసిన మారుతి వాహనం ఉందన్నారు. తమ దగ్గర 80 తులాల బంగారం, కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో 8.28 ఎకరాల వ్యవసాయం భూమి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
స్థిరాస్తుల విలువ రూ.10.86 కోట్లు..
బంజారాహిల్స్, యూసుఫ్‌గూడల్లో తనకు ప్లాట్లు ఉన్నాయన్నారు కేంద్రమంత్రి. స్థిరాస్తుల విలువ 10.86 కోట్లు, కుటుంబానికి 1.63 కోట్ల అప్పులున్నట్లు తెలిపారు. తన దగ్గర ప్రస్తుతం 70 వేలు నగదు ఉన్నట్లు వెల్లడించారు.
Also Read : ఐదేళ్లలో 39 శాతం పెరిగిన చంద్రబాబు, ఆయన భార్య ఆస్తులు!