Lok Sabha Elections 2024: జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి, ఓబుల్‌రెడ్డి స్కూల్ లో జూ.ఎన్టీఆర్.. సెలబ్రెటీల ఓట్లు ఎక్కడంటే? రేపు ఓబుల్‌రెడ్డి స్కూల్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరితో పాటు వెంకటేష్, మహేష్ బాబు తదితర సెలబ్రెటీలు ఎవరు ఎక్కడ ఓటు హక్కు వినియోగించుకోనున్నారో తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. By Nikhil 12 May 2024 in నేషనల్ తెలంగాణ New Update షేర్ చేయండి Tollywood Celebrities Casting Vote Tomorrow: రేపు తెలంగాణలో పార్లమెంట్, ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే లక్షలాది మంది తమ ఓటు హక్కును వినియోగించకునేందుకు తమ సొంత ప్రాంతాలకు చేరుకుంటున్నారు. అయితే.. తెలుగు సినిమా సెలబ్రెటీల్లో దాదాపు 99 శాతం మందికి హైదరాబాద్ లోనే ఓటు ఉంది. దీంతో వారు ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే.. సాధారణంగా తమ అభిమాన హీరో, డైరెక్టర్ ఫ్యామిలీ ఏ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు? అన్న ఆసక్తి సాధారణంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు ఓటు వేసే ప్రాంతాల వివరాలు ఇలా ఉన్నాయి.. -- ఓబుల్‌రెడ్డి స్కూల్ లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి -- బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్ -- జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మహేశ్‌బాబు, నమ్రత , మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, జీవిత, రాజశేఖర్ -- ఎఫ్‌ఎన్‌సీసీ లో రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్ , విశ్వక్‌సేన్ , దగ్గుబాటి రాణా, సురేశ్ బాబు, -- జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్. -- జూబ్లీహిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో రవితేజ -- వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్ -- మణికొండ: హైస్కూల్ లో వెంకటేశ్, బ్రహ్మానందం -- షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూలో రాజమౌళి, రామారాజమౌళి - బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో హీరో రామ్ పోతినేని -- గచ్చిబౌలి జిల్లా పరిషత్ పాఠశాలలో హీరో నాని -- దర్గా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ లో హీరో సుధీర్ బాబు -- రోడ్ నెం.45, జూబ్లీహిల్స్–ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్ -- యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి #mahesh-babu #lok-sabha-elections-2024 #chiranjeevi #jr-ntr #ram-charan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి