Lokesh: యాదవులను బీసీ-బీలో చేర్చుతాం.. లోకేష్ కీలక వ్యాఖ్యలు! టీడీపీ నేత లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-బీలో చేర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. టీడీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రోడ్లు వేస్తామని అన్నారు. By V.J Reddy 16 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి TDP Lokesh: ఈ రోజు మునగపాకలో అంగన్వాడీల శిబిరానికి వెళ్లారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అధికారంలోకి వచ్చాక అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం అని వారికి హామీ ఇచ్చారు. బెదిరింపు వ్యాఖ్యలు సీఎం జగన్ (CM Jagan) నియంతృత్వ పోకడలకు నిదర్శనం అని అన్నారు. వాలంటీర్లతో నడిపించుకుంటామని మంత్రులు చెప్పడం దుర్మార్గం అని అన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీ (TDP) అధికారంలోకి రాబోతుందని.. అంగన్వాడీల ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దని కోరారు. ALSO READ: రేవంత్ సంచలన నిర్ణయం.. మేడిగడ్డ, అన్నారంపై విచారణ వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది: లోకేష్ వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో రైతులు కష్టాల్లో ఉన్నారని లోకేష్ అన్నారు. అనకాపల్లి జిల్లాలో యువగళం (Yuvagalam) పాదయాత్ర చేపట్టారు లోకేష్. ఈ పాదయాత్రలో తమ సమస్యలు చెప్పుకోడానికి గంగాదేవిపేట రైతులు లోకేష్ ను కలిశారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నామని రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ కాల్వల నిర్వహణ గాలికొదిలేశారని ఫైర్ అయ్యారు. అధికారంలోకి రాగానే శారద కాలువ పూడిక తీయిస్తాం అని హామీ ఇచ్చారు. ALSO READ: కేసీఆర్ ఫ్యామిలీ పాస్ పోర్టులు గుంజుకోండి .. బండి సంజయ్ సంచలన డిమాండ్ ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-బీలో చేర్చుతాం.. విశాఖలో జీవీఎంసీ 82వ వార్డులో యాదవులతో నారా లోకేష్ భేటీ అయ్యారు. యాదవులకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్ర్యం ఇచ్చింది టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో యాదవులకు 90 శాతం రాయితీతో పరికరాలు అందించాం అని గుర్తు చేశారు లోకేష్. గొర్రెలు, మేకల కొనుగోలుకు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించాం అని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే యాదవులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్య అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక పాడైన అన్నిచోట్లా కొత్త రోడ్లు వేస్తాం అని అన్నారు. ఉత్తరాంధ్ర యాదవులను బీసీ-బీలో చేర్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. #ap-news #lokesh #tdp #yuvagalam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి