General Elections 2024 : అక్కడ తొలిసారిగా మహిళా అభ్యర్థిపై బీజేపీ పందెం.. ఎవరీ పల్లవి?

పల్లవి డెంపో.. గోవాలో బీజేపీ అభ్యర్థిగా నిలిచిన ఓ మహిళ మీదనే ఇప్పుడు యావత్‌ దేశం దృష్టి పడింది. ఎందుకంటే ...గోవా ఎన్నికల చరిత్రలో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసిన తొలి మహిళా అభ్యర్థి ఆమె.ఇంతకు ఎవరు ఆమె.. ఆమె కథేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.

New Update
General Elections 2024 : అక్కడ తొలిసారిగా మహిళా అభ్యర్థిపై బీజేపీ పందెం.. ఎవరీ పల్లవి?

Pallavi : పల్లవి డెంపో(Pallavi Dempo).. గోవా(Goa) లో బీజేపీ(BJP) అభ్యర్థిగా నిలిచిన ఓ మహిళ మీదనే ఇప్పుడు యావత్‌ దేశం దృష్టి పడింది. ఎందుకంటే ఆమెకు ఇంతకు ముందు ఆమె రాజకీయాల్లో లేదు.. కానీ రాజకీయ నాయకుల దృష్టంతా ఆమె మీదనే పెట్టారు. ఎందుకంటే గోవా ఎన్నికల చరిత్రలో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసిన తొలి మహిళా అభ్యర్థి ఆమె.

ఇంతకు ఎవరు ఆమె.. ఆమె కథేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే. డెంపో ఇండస్ట్రీస్(Dempo Industries) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పల్లవి డెంపో గోవా నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. సార్వత్రిక ఎన్నిక(General Elections) లకు 111 మంది అభ్యర్థులతో కూడిన తాజా జాబితాలో దక్షిణ గోవా నుంచి డెంపోను అభ్యర్థిగా బీజేపీ ఆదివారం ప్రకటించింది. గోవా వ్యాపారవేత్త, విద్యావేత్త అయిన పల్లవి, పూణేలోని MIT నుండి కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ (MBA)లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉంది. ఆమె డెంపో ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా మీడియా, రియల్ ఎస్టేట్ విభాగాన్ని చూసుకుంటుంది.

దక్షిణ గోవా సీటును ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుడు ఫ్రాన్సిస్కో సర్దిన్హా ప్రాతినిధ్యం వహిస్తున్నారనే విషయం తెలిసిందే. 1962 నుంచి బీజేపీ ఈ సీటును కేవలం రెండుసార్లు మాత్రమే గెలుచుకుంది. వాస్తవానికి, 20 అసెంబ్లీ స్థానాలు దక్షిణ గోవా లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. అంతకుముందు జరిగిన ఎన్నికలలో, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ, యునైటెడ్ గోన్స్ పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రమే ఎన్నికయ్యారు. అయితే 1999, 2014 ఎన్నికల్లో బీజేపీ ఈ సీటును గెలుచుకున్నప్పటికీ నిలబెట్టుకోలేకపోయింది.

పల్లవి డెంపో భర్త శ్రీనివాస్ డెంపో గోవా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(GCCI) కి నేతృత్వం వహిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త. బాలికలకు వృత్తి శిక్షణ అందించేందుకు గ్రామీణ పాఠశాలల దత్తత కార్యక్రమం కింద డెంపో కుటుంబం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను దత్తత తీసుకుంది. అదే సమయంలో, పల్లవి డెంపో ఇండో-జర్మన్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షురాలిగా వ్యవరిస్తున్నారు. ఇది జర్మనీ, గోవా మధ్య సాంస్కృతిక ప్రచారానికి దోహదం చేస్తుంది. వెండెల్ రోడ్రిక్స్ ప్రారంభించిన ఫ్యాషన్, టెక్స్‌టైల్ మ్యూజియం అయిన మోడా గోవా ఫౌండేషన్‌కు ఆమె ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు.

పల్లవి 2012 నుండి 2016 వరకు గోవా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అకడమిక్ కౌన్సిల్ సభ్యురాలిగా పనిచేశారు. పల్లవి డెంపో అనేక ఇతర సంస్థల్లో సభ్యురాలిగా ఉండటమే కాకుండా, గోవా క్యాన్సర్ సొసైటీ మేనేజింగ్ కమిటీలో కూడా ఒక భాగం, ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ మహిళా మండలి అయిన AIMA ఆస్పైర్ కోర్ కమిటీలో కూడా పని చేస్తున్నారు.

Also Read : మరో ఐదు రోజుల్లో మండిపోనున్న ఎండలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు