Vinod Kumar: టీఆర్‌ఎస్‌గా మారబోతున్న బీఆర్ఎస్.. మాజీ ఎంపీ వినోద్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్‌ మళ్లీ టీఆర్ఎస్‌గా మారబోతుందా అనే దానిపై బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్‌గా మార్చడం తమ పార్టీ క్యాడర్ లో 80 శాతం మందికి ఇష్టం లేదని అన్నారు.

New Update
Vinod Kumar: టీఆర్‌ఎస్‌గా మారబోతున్న బీఆర్ఎస్.. మాజీ ఎంపీ వినోద్ కీలక వ్యాఖ్యలు

BRS Leader Vinod Kumar: బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌గా మారబోతుందా..! పార్టీ నేతల నుంచి సిగ్నల్స్ అలానే ఉన్నాయి. పార్టీ సీనియర్‌ నేత, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు దీన్నే నిజమంటున్నాయి. 80శాతం నేతలు, కేడర్‌... టీఆర్‌ఎస్ పేరే ఉండాలని కోరుతున్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్‌గా మార్చడంపై పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత సమీక్ష జరపనున్నట్లు తెలిపారు. వినోద్ కుమార్ ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు దీన్ని బలపరుస్తున్నాయి.

ALSO READ: అలా చేస్తే రాజకీయాల్లో నుండి తప్పుకుంటా.. ఈటల సంచలన సవాల్

బీఆర్‌ఎస్‌ పేరును మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ మాటలు ఇలాంటి సంకేతాలనే అందిస్తున్నాయి. పార్టీ పేరు మార్పుపై ఆయన కీలక విషయాలను వెల్లడించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇటీవల వరుసగా జరుపుతున్న రివ్యూ మీటింగ్‌లో 80 శాతం కార్యకర్తలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా చెప్పారు. మళ్లీ టీఆర్‌ఎస్‌గా మార్చాలనుకుంటే న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా టీఆర్‌ఎస్‌ పేరునే కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గా మార్చడంపై, లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు బి. వినోద్‌కుమార్‌.

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చాక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. పేరును మార్చినప్పటికీ.. దేశంలో పూర్తి స్థాయిలో పాగా వేయకలేపోయింది. ఇక మొన్నటి ఎన్నికల్లో అనూహ్య రీతిలో పరాజయం పాలయ్యింది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రమాదవశాత్తూ జారీ కింద పడ్డారు. నిన్నటికి నిన్న కవిత అరెస్ట్ అయింది. ఈ పరిణామాలతో పేరు మార్చినప్పటి నుంచి పార్టీకి, నేతలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయని.. కొందరి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ కూడా మళ్లీ పేరు మార్పు దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు