V. Hanumantha Rao: భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేశారు.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు భట్టి విక్రమార్కపై సంచలన ఆరోపణలు చేశారు వీహెచ్. తనను ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయకుండా భట్టి అడ్డుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. By V.J Reddy 10 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పీసీసీ అధ్యక్షుడు వీ. హనుమంతరావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై సంచలన ఆరోపణలు చేశారు. భట్టి విక్రమార్క తనకు ద్రోహం చేస్తున్నారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు భట్టి తనను ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియదని పేర్కొన్నారు. తన కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరని అన్నారు. భట్టి విక్రమార్క ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం తానే అని పేర్కొన్నారు. తనను లోకల్ కదాని అంటున్నారని.. రేణుక చౌదరి, నాదెండ్ల, పీవీ రంగయ్య స్థానికులా? అని ప్రశ్నించారు. వారు ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి గెలవలేదా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ALSO READ: ముందు క్షమాపణ చెప్పు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ రాజ్యసభ రాలేదు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉన్నా.. పార్టీ నమ్ముకుని.. పార్టీ బలోపేతం కోసం పని చేశారు మాజీ పీసీసీ చీఫ్, రాజ్య సభ సభ్యుడు వి. హనుమంతరావు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే టికెట్ కోసం మంతనాలు జరిపారు.. కానీ టికెట్ రాలేదు. తరువాత ఎమ్మెల్సీ వస్తుందని ఆశించిన వీహెచ్ కు నిరాశే మిగిలింది. రాష్ట్ర రాజకీయాల్లో కాదు దేశ రాజకీయాల్లో తన గొంతు వినిపించాలని అనుకోని రాజ్యసభ టికెట్ ఆశించారు వీహెచ్.. కానీ ఈ విషయంలోనూ కాంగ్రెస్ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. రాజ్యసభ రెండు స్థానాలను సీనియర్ నాయకురాలు రేణుక చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లకు కేటాయించింది. ఎంపీ టికెట్ రేసులో.. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 16 స్థానాల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయింపు పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య భట్టి నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. తాజాగా ఈ రేసులోకి కొత్త వ్యక్తి వచ్చారు. అదెవరో కాదు మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంతరావు. ఖమ్మం పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ కొరకు గాంధీ భవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ఎంపీ టికెట్ ఇస్తుందనేది మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. #bhatti-vikramarka #lok-sabha-elections #v-hanumantha-rao #khammam-mp-ticket మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి