/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Congress-jpg.webp)
Telangana Congress MP Candidates: తెలంగాణ పగ్గాలను చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ అదే జోష్ ను రానున్న లోక్ సభ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో సర్వేలలో గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలో ఉంది. తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో మూడు రంగుల జెండా ఎగురవేయాలని వ్యూహాలు రచిఉస్తోంది. ఇటీవల కోస్గిలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో మొదటి ఎంపీ అభ్యర్థిని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్ ఎంపీగా వంశీచంద్ రెడ్డి పేరును సీఎం రేవంత్ ఖరారు చేశారు.
16 స్థానాల్లో 12 ఫైనల్?
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల బరిలో దిగే మొదటి అభ్యర్థిని ప్రకటించడంతో మిగత 16 స్థానలపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది. 16 లోక్ సభ స్థానాల్లో 12 స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 8 మందితో మొదటి లిస్ట్ మరో రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఆ 8 మంది వీరే?..
* కరీంనగర్- ప్రవీణ్ కుమార్ రెడ్డి,
* నిజామాబాద్ - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి,
* పెద్దపల్లి - గడ్డం వంశీ
* జహీరాబాద్ - సురేశ్ షెట్కార్,
* చేవెళ్ల - సునీతా మహేందర్ రెడ్డి,
* సికింద్రాబాద్ - బొంతు రామ్మోహన్
* నల్గొండ - జానారెడ్డి / రఘువీర్ రెడ్డి
* మహబూబ్‌నగర్ - వంశీచంద్ రెడ్డి.
తలనొప్పిగా మారిన ఖమ్మం సీటు..
కాంగ్రెస్ అధిష్టానానికి ఖమ్మం ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం పెద్ద తలనొప్పిగా మారింది. ఇందుకు ప్రధాన కారణం ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు పోటీలో ఉండడమే. డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఎంపీ టికెట్ రేసులో ఉండడమే. అయితే వీరిలో ఎవరికీ టికెట్ కేటాయించిన పార్టీ చీలుతుందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ ఖమ్మం ఎంపీ టికెట్ ను రాహుల్ గాంధీకి ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది చూడాల్సి ఉంది.