Rahul Gandhi: ఖమ్మం ఎంపీ టికెట్ వార్.. తెరపైకి రాహుల్ పేరు!

కాంగ్రెస్‌లో ఖమ్మం ఎంపీ టికెట్ పంచాయతీకి ఇంకా తెర పడలేదు. ఇప్పటికే ఎంపీ టికెట్ కొరకు మంత్రులు భట్టి, పొంగులేటి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి కీలక బాధ్యతలు
New Update

Rahul Gandhi: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో గెలుపుపై వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉండగా ఖమ్మం ఎంపీ అభ్యర్థి ప్రకటన కాంగ్రెస్ హైకమాండ్ కు పెద్ద తలనొప్పిగా మారిందని టాక్ వినిపిస్తోంది దీనికి ప్రధాన కారణం ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యులు ఎంపీ టికెట్ రేసులో ఉండడమే. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఖమ్మంలో పార్టీ క్యాడర్ ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్, 40 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ఖమ్మం నుంచి ఎంపీగా రాహుల్...

ఖమ్మంలో ముగ్గురు మంత్రుల కుటుంబంలో ఎవరికో ఒకరి టికెట్ కేటాయించిన పార్టీ చీలుతుందని భావించిన కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి రాహుల్ గాంధీని దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీని ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పోటీ చేస్తారంటే తాము పోటీ నుంచి తప్పుకుంటామని ముగ్గురు మంత్రులు ఏఐసీసీకి చెప్పారట. అయితే గతంలో ఖమ్మం నుంచి లోక్ సభకు సోనియా గాంధీ వెళ్తారని ప్రచారం జరగగా.. తాజాగా సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో మరోసారి ఖమ్మం ఎంపీ సీటు రచ్చకు ఎక్కింది. ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.

ఖమ్మం ఎంపీ టికెట్.. మంత్రుల మధ్య వార్.

లోక్ సభ ఎన్నికల్లో విజయం వైపు అడుగులు వెయ్యాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం ఎంపీ టికెట్ తలనొప్పిగా మారింది. ఖమ్మం పార్లమెంట్ సీటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్నట్లు కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఖమ్మం ఎంపీ సీటు రేసులో భట్టి సతీమణి మల్లు నందినితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు.

సోషల్ మీడియా వేదికగా..

సోషల్‌ మీడియాలో పోటాపోటీగా తమకే ఎంపీ టికెట్ వస్తుందని ప్రచారాలు చేసుకుంటున్నారు భట్టి భార్య, పొంగులేటి సోదరుడు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరికి రాజ్యసభ ఇవ్వడంతో ఈ ఇద్దరి మధ్యే పోటీ నెలకొంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఖమ్మం సీటు ఎవరకి ఇస్తుందనే దానిపై ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. సతీమణికి ఎంపీ టికెట్ కోసం భట్టి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తమ్ముడికి టికెట్ ఇప్పించుకునేందుకు పొంగులేటి లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.

#mp-elections-2024 #rahul-gandhi-telangana #cm-revanth-reddy #khammam-mp-ticket #rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe