PM Modi: ప్రధాని మోడీ సంచలన ప్రకటన

పార్లమెంట్ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ పర్యటనలో సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోడీ. దేశ వ్యాప్తంగా సోదాల్లో ఈడీ అధికారులు రూ.3 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నారని.. ఆ డబ్బంతా పేద ప్రజలకు పంచేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

New Update
NDA Meeting: పవన్ కళ్యాణ్ అంటే పవనం కాదు.. ఒక సునామీ.. మోదీ పవర్ ఫుల్ డైలాగ్స్..!

PM Modi slams TMC: రానున్న లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400లకు పైగా ఎంపీ సీట్లు గెలవాలని వ్యూహాలు రచిస్తోంది బీజేపీ (BJP). ఈ క్రమంలో దేశంలో వరుస పర్యటనలు చేపట్టారు ప్రధాని మోడీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పశ్చిమ బెంగాల్ లో (West Bengal) పర్యటించారు ప్రధాని మోడీ. జల్పాయిగురిలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ పార్టీపై విమర్శల దాడికి దిగారు.

ALSO READ: కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి మార్పు?.. సీఎం రేవంత్ క్లారిటీ!

టీఎంసీ, లెఫ్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మూడు ఒకటే మార్గంలో నడుస్తాయని అన్నారు. ఈ మూడు పార్టీలు అవినీతి మార్గంలో నడుస్తున్నాయని మండిపడ్డారు. తమ పార్టీలో అవినీతి చేసిన నాయకులను కాపాడుకోవడానికే ఇండియా కూటమి పెట్టుకున్నారని విమర్శించారు. అవినతినికి బీజేపీ ఎప్పుడూ దూరంగా ఉంటుందని అన్నారు. బీజేపీ అంటేనే అవినీతి నిర్మూలన అని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత పటిష్టంగా ఉంటే, మన దేశంపై ప్రపంచానికి అంత నమ్మకం ఉంటుందని వ్యాఖ్యానించారు.

దేశంలో ప్రజలు మరోసారి కేంద్రంలో మోడీ ప్రభుత్వం రావాలని అనుకుంటారని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో కూడా కాషాయ జెండా ఎగరబోతుందని ధీమా వ్యక్తం చేశారు. సందేశ్‌కలి దోషులను వదిలిపెట్టేది లేదని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దోషులకు టీఎంసీ అండగా ఉందని ఆరోపించారు. బీజేపీ తోనే దేశంలో వికసిత్ భారత్ సాధ్యమని పేర్కొన్నారు. కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రాగానే ఈడీ స్వాధీనం చేసుకున్న రూ.3,000 కోట్లను పేద ప్రజలకు పంచుతామని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు