Lok Sabha Elections 2024: దేశంలో పార్లమెంట్ ఎన్నికల తేదీపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 16న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి అంటూ గత కొన్ని రోజులు సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఢిల్లీలో ఏప్రిల్ 16న ఎన్నికల నిర్వహణకు ఆ రాష్ట్ర సీఈవో (CEO) కార్యాలయం సన్నాహాలకు సిద్ధమవడం హాట్ టాపిక్ మారింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకే అక్కడి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఢిల్లీ ఎన్నికల కార్యాలయం (Delhi CEO Office) దీనిపై క్లారిటీ ఇచ్చింది.
రిఫరెన్స్ మాత్రమే..
ఏప్రిల్-16నే లోక్ సభ ఎన్నికలంటూ జరుగుతున్న ప్రచారానికి ఎన్నికల సంఘం (Election Commission of India) చెక్ పెట్టింది. ఎలక్షన్‌డేట్‌పై క్లారిటీ ఇచ్చింది సీఈసీ. అది అధికారిక ప్రకటన కాదంటూ వివరణ ఇచ్చింది. కేవలం అధికారుల రిఫరెన్స్ కోసం మాత్రమే ఆ తేదీని ఇచ్చినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ డేట్‌ని కటాఫ్‌గా పెట్టుకొని ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్నీ ట్విటర్ వేదికగా వెల్లడించింది.
అప్పుడు.. ఇప్పుడు
ఏప్రిల్ 16న లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి అంటూ జరిగిన ప్రచారాన్ని అందరు నమ్మడానికి లేదా అప్పుడే జరుగుతాయి ప్రజలు అనుకునే దానికి ప్రధాన కారణం. గత కొన్ని ఏండ్లుగా లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ లేదా మే నెలలోనే జరగడం. 2004, 2008, 2019 లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్, మే నెలలో జరిగాయి. ఈ సారి కూడా అదే నెలలో జరుగుతాయని అందరు అనుకుంటున్నారు. మరి లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై ఇంకా ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వలేదు. లోక్ సభ ఎన్నికల డేట్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కిషన్ రెడ్డి కూడా అదే మాట..
ఇటీవల తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్ సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయం మీడియాకు తెలిపారు. ఏప్రిల్ నెలలోనే లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. కేంద్రం లో మరోసారి బీజేపీ పార్టీ అదికారంలోకి రాబోతుందని అందులో సందేహం లేదని అన్నారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ లోనే జరుగుతాయనే దానికి బలం చేకూర్చాయి.
DO WATCH: