MLA KTR: తెలంగాణ భవన్‌లో జరిగిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శల దాడికి దిగారు. దమ్ముంటే రాజీనామా చేసి.. ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
ALSO READ: సీఎం కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన కోర్టు
రేవంత్ భయపడ్డాడు..
మల్కాజ్‌గిరిలో ఈ ఐదేండ్లలో రేవంత్ ఒక్క పని చేయలేదు. ఎవర్నీ పలుకరించినా పాపాన పోలేదు. కాబట్టి ఆవేశానికి పోతే ఓడిపోతానని రేవంత్ భయపడ్డాడు. అందుకే పలుకలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరిలో నిలబడేందుకు భయపడుతున్నాడు. ఏప్రిల్ 18న నామినేషన్లు.. సమయం చాలా ఉంది కాబట్టి రేవంత్‌కు ధైర్యం వచ్చి రాజీనామా చేసి వస్తే నేను వస్తా.. తప్పకుండా నిలబడుతాను. నాకు తెలుసు ఆయన రాడు.. పిరికోడు. నరుకుడు ఎక్కువ.. అసలు విషయానికి వస్తే పారిపోతాడు. చాలా పెద్ద మాటలు, డైలాగులు చెబుతాడు. కానీ ఆచరణలో మాత్రం చూపించడు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
పోటీ వ్యక్తుల మధ్య కాదు.. పార్టీల మధ్య..
మల్కాజ్‌గిరిలో జరిగే పోటీ.. కేవలం వ్యక్తుల మధ్య కాదు.. పోటీ మూడు పార్టీల మధ్య. కేసీఆర్ నిలబడ్డారని భావించి పని చేయాలి. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో తుఫానులా మెజార్టీ ఇచ్చారు. మూడు లక్షల యాభై ఓట్ల మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇతర పార్టీలు మూడున్నర లక్షలు దాటి ముందుకు వచ్చి గెలవాలి.
అయినా కూడా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలి. కార్పొరేట్ ఎన్నికల్లో మాదిరిగానే ప్రతి ఇంటికి వెళ్లాలి. దేశంలోనే అత్యంత పెద్ద నియోజకవర్గం మల్కాజ్‌గిరి. కాబట్టి ప్రతి వాడ తిరిగి ప్రచారం చేయాలి. రాగిడి లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.