KCR: వెంటనే విడుదల చేయాలి.. కవిత, కేజ్రీవాల్ అరెస్ట్‌పై కేసీఆర్ ఫైర్

ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడంపై ఫైర్ అయ్యారు కేసీఆర్. ఈడీ, సీబీఐ, ఐటీ త‌దిత‌ర కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పావులుగా వాడుకుంటుందని ఆరోపించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Telangana Politics: బీఆర్‌ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు!
New Update

BRS Chief KCR: లోక్ సభ ఎన్నికల వేళ లిక్కర్ స్కాం కేసులో తన కూతురు ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ పై తొలిసారి స్పందించారుబీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎంఅర‌వింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు అని అన్నారు.

ALSO READ: కేజ్రీవాల్ అరెస్ట్.. కోర్టు కీలక నిర్ణయం?

ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ద‌ని ఇటీవ‌ల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఘ‌ట‌న‌లు రుజువు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ త‌దిత‌ర కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం పావులుగా వాడుకుంటుందని ఆరోపించారు.

ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న బీజేపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను భారత రాష్ట్ర స‌మితి తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అని పేర్కొన్నారు. అక్ర‌మ కేసుల‌ను వెంట‌నే వెన‌క్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంట‌నే విడుదల చేయాల‌ని డిమాండ్ చేశారు.

#kcr #mlc-kavitha-arrest #kejriwal-arrest
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe