BRS MP Candidates: ఇద్దరు ఎంపీలను ప్రకటించిన కేసీఆర్

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ క్రమంలో ఈరోజు ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను ఫైనల్ చేశారు.

New Update
BRS Party In AP: ఏపీలో బీఆర్ఎస్ పోటీ?.. బీఫామ్ ఇవ్వాలంటూ కేసీఆర్ వద్దకు నేత

BRS MP Candidates - Lok Sabha Elections 2024: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో రానున్న లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR). ఈ క్రమంలో ఎంపీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. ఇవాళ ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ (Karimnagar) ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ (B Vinod Kumar), పెద్దపల్లి (Peddapalli) ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) పేర్లను కేసీఆర్ ఫైనల్ చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఇది వరకే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ మీటింగ్ లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. ఇటీవల పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ బీఆర్ఎస్  పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుత అక్కడి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్  కు మరోసారి టికెట్ ఇవ్వాలని మొదటగా గులాబీ బాస్ అనుకోగా.. తాజాగా ఆయన పార్టీ మారడంతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఎంపీ టికెట్ కేటాయించారు కేసీఆర్.

ALSO READ: మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

మెదక్ ఎంపీగా కేసీఆర్?..

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని మాజీ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు  తెలుస్తోంది. ఇందుకు కారణం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది సీఎం కుర్చీ పోవడమే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి చెంది.. గజ్వేల్ లో విజయం సాధించారు. తెలంగాణలో తమ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారని.. అందుకే అసెంబ్లీ సమావేశాలకు కూడా రాలేదని ఒక వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం తుంటి ఎముకకు సర్జరీ కావడంతో కేసీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని అందుకే ఇన్ని రోజులు ప్రజలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి అసెంబ్లీకి బై చెప్పి పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపిస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరందుకుంది. మరి కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజుల వరకు వేచి చూడాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు