T. Padma Rao Goud : సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.. బరిలో సంచలన నేత

లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే మరో అభ్యర్థిని ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం పద్మారావు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

T. Padma Rao Goud : సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్.. బరిలో సంచలన నేత
New Update
Secunderabad MP : లోక్ సభ ఎన్నిక(Lok Sabha Elections) ల బరిలో నిలిచే మరో అభ్యర్థిని ప్రకటించారు మాజీ సీఎం కేసీఆర్(Ex. CM KCR). సికింద్రాబాద్(Secunderabad) ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్(T. Padma Rao Goud) పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం పద్మారావు సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ లాంటి బలమైన నేతలు సికింద్రాబాద్ ఎంపీ రేసులో ఉండడం వల్ల కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ALSO READ : సీఎం జగన్ కు షాక్.. ఎమ్మెల్యే పై కేసు నమోదు

1984 నుంచి.. 
పద్మారావు గౌడ్‌ తన రాజకీయ జీవితాన్ని 1984 నుంచి ప్రారంభించారు. 1984 నుంచి 1991 వరకు కార్పొరేటర్‌గా పనిచేసిన ఆయన కాంగ్రెస్‌(Congress) నుంచి 2001లో ఆనాటి టీఅర్ఎస్(TRS) ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ(BRS Party) లో చేరారు. అనంతరం 2002 లో టీఅర్ఎస్ అభ్యర్థిగా కారు గుర్తుపై కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. అలాగే 2004 లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుపై ఎమ్మెల్యే నిలబడి గెలిచారు. 2009 అసెంబ్లీ ఎన్నిక(Assembly Elections) ల్లో పద్మారావు గౌడ్‌ సనత్‌ నగర్‌ నియోజకవర్గంలో పోటీ చేసి.. కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎక్సైజ్‌ శాఖ, క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ స్పీకర్ అయ్యారు. 2023లో సికింద్రాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొందారు.
ఇప్పటికి వరకు ప్రకటించిన అభ్యర్థులు..

* పెద్దపల్లి – మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
* కరీంనగర్ – మాజీ ఎంపీ వినోద్ కుమార్
* మహబూబాబాద్ – మాలోత్ కవిత
* ఖమ్మం – నామా నాగేశ్వరరావు
* చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్
* వరంగల్ – కడియం కావ్య
* మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మారెడ్డి
* ఆదిలాబాద్ – ఆత్రం సక్కు
* నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్‌
* జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్
* నాగర్ కర్నూల్ - ఆర్ ఎస్ ప్రవీణ్
* మెదక్ - మాజీ ఐఏఎస్ వెంకట్రామి రెడ్డి
* సికింద్రాబాద్ - పద్మారావు గౌడ్
* మహబూబ్‌ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి

#kcr #2024-lok-sabha-elections #brs-mp-candidate-list #t-padma-rao-goud
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe