IAS Transfers In Telangana: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్, 40 మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మరోసారి ఐదుగురు ఐఏఎస్ అధికారులతో పాటు 40 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

New Update
Telangana : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లు బదిలీ

IAS Transfers In Telangana: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఐదుగురు ఐఏఎస్ అధికారులతో పాటు 40 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

ALSO READ: ఆస్థి కోసం అత్తమామలను కాల్చిన అల్లుడు

ఐదుగురు ఐఏఎస్ అధికారులు..

* మెదక్ జిల్లా కలెక్టర్‌గా రాహుల్ రాజ్‌.
* ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా రాజర్షి షా.
* కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్‌గా స్నేహ శేబరిష్.
* ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ నుంచి GHMC అడిషనల్ కమిషనర్‌గా భోర్ఖాడే హేమంత్‌ను బదిలీ.
* నల్గొండ జిల్లా నుంచి హైదరాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా కేశవ్ పాటిల్‌ బదిలీ.

40మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ..

తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ శాఖపై ఉక్కుపాదం మోపుతోంది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన 40 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ఒకేసారి బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మూడు సంవత్సరాల కంటే ఒకే చోట పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ అధికారులను బదిలీలు చేస్తోంది. ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణలు ఎదురుకుంటున్న అధికారులనుయ్, గత ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అధికారులనే టార్గెట్ చేస్తూ రేవంత్ సర్కార్ బదిలీలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రజల్లో చర్చ జోరందుకుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు