Harish Rao: అప్పులు కట్టకండి.. రైతులకు హరీష్ రావు పిలుపు

అధికారంలోకి రాగానే రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని.. రైతులెవరూ ఇప్పుడు బ్యాంకులకు అప్పులు కట్టోద్దు అని హరీష్ రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో 180 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు.

MLA Harish Rao: పవర్‌ బ్రోకర్లు పార్టీ వీడుతున్నారు.. హరీష్ రావు ఫైర్
New Update

BRS MLA Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మీబాయి తండాలో క్షేత్ర స్థాయి పర్యటన చేశామని.. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.. ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేశామని తమకి చెప్పినట్లు తెలిపారు. పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు.. తండాల్లో తాగు నీరు కూడా సరిగా రావడం లేదు అని ఫైర్ అయ్యారు.

ALSO READ: జనసేనలోకి వంగవీటి రాధా.. ముహూర్తం ఫిక్స్!

180 రైతులు మృతి..

రైతుల మీద శ్రద్ద లేదు గానీ ఈ ప్రభుత్వానికి చిల్లర మల్లర చేష్టలకు పాల్పడుతోందని అన్నారు. 180 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. కనీసం క్షేత్ర స్థాయి కి అధికారుల బృందాన్నీ కూడా పంపలేదని విమర్శించారు. మళ్ళీ రైతులు అప్పుల పాలవుతున్నారని.. బ్యాంకు అధికారులు రైతులకు అప్పులు కట్టాలని లీగల్ నోటీసులు ఇస్తున్నారని పేర్కొన్నారు. అందోల్ నియోజకవర్గం రేగోడ్ మండలంలో గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు అనేక గ్రామాల్లో అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు ఇస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ఏం చెప్పారో తమకూ సంబంధం లేదని రుణాలు కట్టాల్సిందేనని బ్యాంకు అధికారులు గ్రామాల మీద పడుతున్నారు. బ్యాంకులకు రాజకీయాలకు సంబంధం లేదంటున్నారు. గతం లో అంజుమన్ అధికారులు అప్పుల వసూలు కు రైతులను వేధించినట్టు ఇపుడు వేధిస్తున్నారని అన్నారు.

హరీష్ ప్రశ్నల వర్షం..

* ఇది రుణాల వసూలు కు అనువైన సమయమా?

* రైతు పై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు బ్యాంకు అధికారులు పడుతున్నారు

* రేవంత్ ఎన్నికలప్పుడు ఏం చెప్పా రు ..ఇపుడు ఏం చేస్తున్నారు

* రైతులకు నాలుగు ప్రధాన హామీలు ఇచ్చి కాంగ్రెస్ నట్టేట ముంచింది

* కాంగ్రెస్ ఏ మొహం పెట్టుకుని పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడుగుతుంది ?

* సీఎం రేవంత్ కు పార్టీ గేట్లు తెరవడంపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టుల గేట్లు తెరవడం మీద లేదు

* కేసీఆర్ గారు ఈ ఉదయం పార్టీ నేతాల తో మాట్లాడారు

* రైతుల పొలాలు సందర్శించాలని కేసీఆర్ బీ ఆర్ ఎస్ శ్రేణులను ఆదేశించారు

* రేపు, ఎల్లుండి, ఆ మరసటి రోజు పొలాలకు వెళ్లి పంట నష్టం వివరాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు

* తక్షణమే ఎకరాకు 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి

* రైతుల పక్షాన అన్ని వేదికల మీద పోరాడతాం

* రాజకీయ చేరికల మీద ద్రుష్టి సారిస్తున్నారు తప్ప రైతు కన్నీటి చారికల మీద దృష్టి సారించడం లేదు

* నష్టపోయిన రైతుల వివరాలు ప్రభుత్వం వెంటనే సేకరించాలి

* ఎన్నికల కోడ్ ప్రకృతి వైపరీత్యాల సాయానికి అడ్డు కాకూడదు

* రైతులు ఎవ్వరూ బ్యాంకుల అప్పు కట్టకూడదు

* బ్యాంకు అధికారులు ఎక్కడైనా వేధిస్తే రైతులు బీ ఆర్ ఎస్ నేతల దృష్టికి తెండి

* రైతులను వేధించకుండా ప్రభుత్వం బ్యాంకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి

* రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే లక్షలాది మంది రైతులతో సచివాలయాన్ని ముట్టడిస్తాం

* బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన కాంగ్రెస్ నేతలు రైతులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు

* సోషల్ మీడియా లో తప్పుడు వార్తలు ,ఫేక్ ప్రచారానికే కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు

* యాసంగి వడ్లు వస్తున్నాయి.. ఈ సారి మద్దతు ధరకు 500 బోనస్ గా కలిపి ఇవ్వాల్సిందే

* కాంగ్రెస్ తప్పించుకోవాలని చూస్తే కలెక్టర్ కార్యాలయాలను ముట్టడిస్తాం

* రైతులు దైర్యంగా ఉండండి ..ఆత్మహత్యలకు పాల్పడవద్దు

* బోనస్ కోసం రైతులు కూడా ఒత్తిడి పెంచాలి

* పార్టీ కేంద్ర కార్యాలయానికి పంట నష్టం పై వచ్చిన వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాము

* మేము ఎన్నికల కోడ్ ఉందని కాంగ్రెస్ లాగా ఏ పిర్యాదు చేయం

* రైతులకు సాయం విషయం లో రాజకీయాలకు పాల్పడం

* రాజకీయాలు మాని రైతులకు మేలు చేయండి.

#harish-rao #congress #brs #lok-sabha-elections
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe